S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2017 - 04:52

ఖమ్మం, మార్చి 2: వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజల కష్టాలు తీర్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసిసి పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడుతూ అవగాహన, అనుభవం లేని అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

03/03/2017 - 04:24

హైదరాబాద్, మార్చి 2: వరంగల్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుస్మా స్వరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్ ఎంపి కవితకు సుస్మా స్వరాజ్ లేఖ రాశారు. వరంగల్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కవిత ఇటీవల కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్‌ను కోరారు.

03/03/2017 - 04:23

హైదరాబాద్, మార్చి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లో జలకళ అడుగంటింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో వర్షాకాలం వచ్చేంతవరకు ఉన్న నీటిని మంచినీటి అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలూ పోటాపోటీగా ప్రణాళికలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో కలిపి 174 టిఎంసిల నీరు ఉంది.

03/03/2017 - 04:21

హైదరాబాద్, మార్చి 2: వచ్చే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వడగాడ్పుల తీవ్రత విషయమై ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజిమెంట్ వినూత్న ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటితే వేడిగాలులు ఉన్నట్లు గుర్తిస్తారు. 45 డిగ్రీల సెల్సియస్ దాటితే తీవ్రమైన వేడిగాలులపై హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది.

03/03/2017 - 04:20

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటి (టిజాక్)లో అంతర్మధనం ప్రారంభమైంది. టిజాక్ కన్వీనర్ పిట్టల రవీందర్, కో-కన్వీనర్ తన్వీర్ సుల్తానా, టిజాక్ కో-చైర్మన్ ఎన్.ప్రహ్లాద్‌లు సంయుక్తంగా కోదరండరాంకు రాసిన లేఖపై టిజాక్ కేంద్ర కమిటీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కోదండరాం గురువారం కమిటీ సభ్యులందరితో చర్చించారు.

03/03/2017 - 04:19

హైదరాబాద్, మార్చి 2: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి), బిజెపిలు రెండూ ఓడిపోవడం ఖాయమని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ రెండు పార్టీలు యుపిలో ఘోర పరాజయాన్ని చవిచూస్తాయని, అందుకు ఆ ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు.

03/03/2017 - 04:17

హైదరాబాద్, మార్చి 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ తక్కువ ఖర్చుతో, అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో మానవ సహిత ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు కృషి చేయాలని, ఈ శక్తి మన దేశానికి ఉందని ఇస్రో పూర్వ చైర్మన్ కస్తూరి రంగన్ తెలిపారు. ఈ తరహా ప్రోగ్రాంను అమలు చేసేందుకు అవసరమైన వ్యూహాలను అంతరిక్ష సంస్ధ ఖరారు చేసుకోవాలన్నారు.

03/03/2017 - 04:16

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో నిర్వహించబోయే వివిధ ప్రవేశపరీక్షలు ప్రధానంగా ఎమ్సెట్‌కు సంబంధించి సాంకేతిక సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్ ఎంపిక పూర్తికాకపోవడంతో ప్రవేశపరీక్షల నిర్వహణలో గందరగోళం చెలరేగింది. టిఎస్ ఎమ్సెట్‌తో పాటు టిఎస్ ఇసెట్, టిఎస్ ఐసెట్ షెడ్యూళ్లలో కూడా స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చినా, పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవని మాత్రం అధికారులు చెబుతున్నారు.

03/03/2017 - 04:15

హైదరాబాద్, మార్చి 2: శ్రీవాసవి కాలేజీలో చదువుతూ హాల్ టిక్కెట్లు రాక పోవడంతో పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇటు ప్రభుత్వంతోనూ, అటు కాలేజీ యాజమాన్యంతోనూ వారు పోరు సల్పుతున్నారు. హాల్‌టిక్కెట్ల వివాదంతో ఇంటర్మీడియట్ బోర్డు అవినీతి కూడా బట్టబయలు కావడంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

03/03/2017 - 04:14

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో నలుగురు ఐపిఎస్ అధికారులు పదోన్నతి పొందారు. హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్‌రెడ్డికి డిజిపి హోదా లభించింది. డిజిపి స్థాయి అధికారిగా నగర కమిషనర్‌గా ఉండడం ఇదే మొదటిసారి. తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, అలోక్ ప్రభాకర్, టి కృష్ణప్రసాద్‌లకు డిజిపి హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages