S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2017 - 04:54

సిద్దిపేట, ఫిబ్రవరి 28: సాదాబైనామాలపై కొనుగోలు చేసిన రైతులకు భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకే తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రైతులు భూమి కొనుగోలు చేసినా, కబ్జాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల భూవిక్రేతల వారసులు రిజిస్ట్రేషన్ చేయకుండా బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతన్నారన్నారు.

03/01/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బోగస్ విద్యాసంస్థలు, అనుమతి లేని కళాశాలలతో మోసపోతున్న విద్యార్థులకు దేవుడే దిక్కయ్యాడు. ఏడాది పాటు మంచిగా చదువుకుని తీరా పరీక్ష రాసే సమయంలో చివరి క్షణం వరకు హాల్‌టికెట్లు లభించకపోవడంతో విద్యార్థులు చెందుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు.

03/01/2017 - 04:52

నల్లగొండ, ఫిబ్రవరి 28: యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, గరుడముద్ద, భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలను వేద పండితులు, అర్చక బృందం శాస్తయ్రుక్తంగా వైభవంగా నిర్వహించారు.

03/01/2017 - 03:30

హైదరాబాద్, ఫిబ్రవరి 28: జిహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్థలాలను సేకరించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆయా శాఖల కేంద్ర మంత్రుల వద్దకు స్వయంగా మంత్రులు వెళ్లి స్థలాలను ఇవ్వాలని కోరనున్నారు.

03/01/2017 - 03:29

హైదరాబాద్, ఫిబ్రవరి 28: వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 19 నుంచి 20 శాతం వరకు వృద్ధిరేటు ఉందని, దీనికి తగ్గట్టుగానే బడ్జెట్ ఉంటుందని అన్నారు. గత బడ్జెట్ కన్నా ఈసారి బడ్జెట్‌లో జిఎస్‌టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

03/01/2017 - 03:27

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ ఆఫ్ ప్రెజేంటేషన్‌ను మార్చి 20వ తేదీ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర సాగునీటి శాఖను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.

03/01/2017 - 03:25

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 11న శతాబ్ది పరుగు నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. మంగళవారం నాడు ఆయన పరుగు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి వేణుగోపాలరావు, స్పెషల్ ఆఫీసర్ హెచ్ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/01/2017 - 03:24

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు బిఎ, బి కాం, బిఎస్సీ కోర్సుల ఫస్టియర్‌లో చేరేందుకు టిఎస్ డబ్ల్యుఆర్‌ఇఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టులో దరఖాస్తులు పంపించుకోవాలని అన్నారు.

03/01/2017 - 03:23

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బంగారు తెలంగాణ నిర్మాణానికి సింగరేణి సంస్థ తన వంతుగా తగినంత బొగ్గు ఖనిజాన్ని అందించడంతో పాటు విద్యుత్తును కూడా అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీ్ధర్ తెలిపారు.

03/01/2017 - 03:18

హైదరాబాద్/ జీడిమెట్ల, ఫిబ్రవరి 28: అమెరికాలోని కాన్సాస్‌లో జాత్యహంకారి కాల్పులకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌కు మంగళవారం ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. తండ్రి మధుసూదన్‌రావు తన కుమారుడికి అశృనయనాలతో అంతిమ సంస్కారం నిర్వహించారు.

Pages