S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/17/2016 - 03:21

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్రానికి భద్రాచలం దక్కడానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎఐసిసి నాయకుడు, ఎంపి జైరాం రమేశ్ అన్నారు. నాడు భద్రాచలంను అభివృద్ధి చేసేందుకు నిజాం కృషి చేసినందుకు, దేవస్థానానికి కేర్‌టేకర్‌గా ఉన్నందుకే తెలంగాణకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు.

07/17/2016 - 03:20

హైదరాబాద్, జూలై 16: ‘ఆ పార్టీ లేదు, లేని పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి..’ అని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి పరోక్షంగా తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై చిట-పటలాడారు.

07/17/2016 - 03:19

హైదరాబాద్, జూలై 16 : ముస్లిం మహిళల పెళ్లిల్లకోసం ఉద్దేశించిన ‘షాదీ ముబారక్’ పథకం ఇక నుండి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళుతోంది. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం కింద వచ్చే దరఖాస్తులను ఇక నుండి తహశీల్‌దార్లు ప్రాసెస్ చేసి, సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ముస్లింలలో పేదవర్గాలకు చెందిన మహిళల వివాహాలకోసం ప్రభుత్వం 51 వేల రూపాయలు ఇస్తోంది.

07/17/2016 - 03:19

హైదరాబాద్, జూలై 16: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకం సాఫీగా జరగాలంటే హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థల ఉద్యోగుల పంపకంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని గతంలో నియమించింది.

07/16/2016 - 18:11

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజనలో గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 19న పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డికె అరుణ శనివారం ప్రకటించారు. జమ్ములమ్మ ఆలయం నుంచి ఆలంపూర్ జోగులాంబ ఆలయం వరకూ తన పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు గద్వాలకు అన్ని అర్హతలున్నాయని ఆమె తెలిపారు.

07/16/2016 - 17:56

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ అశోక్‌ ఫలితాలను విడుదల చేస్తారు.

07/16/2016 - 12:09

హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తానని వ్యాఖ్యానించినందుకు హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై సరూర్‌నగర్ పోలీసులు దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేశారు. కరుణాకర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను పరిశీలించాక ఈమేరకు కేసు నమోదు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది.

07/16/2016 - 12:09

హైదరాబాద్: వనస్థలిపురంలోని ప్రశాంత్‌నగర్‌లో శనివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురై రాకేశ్ చంద్ర అనే ఇంజనీరింగ్ విద్యార్థి మరణించాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

07/16/2016 - 08:20

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్‌గా నియమితులైన శేరి సుభాష్‌రెడ్డి శుక్రవారం సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో శేరి సుభాష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

07/16/2016 - 08:20

హైదరాబాద్, జూలై 15: హైదరాబాద్ చుట్టూ ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారమని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్ అన్నోజిగూడ వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావులతో కలిసి ప్రారంభించారు. ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట్ వెళ్లే రోడ్డు సుమారు 21.3కి.మీటర్ల పొడవు ఉందన్నారు.

Pages