S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
సృష్టిలో చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. అందుకు కారణాలు ఎన్నో.
మారుతున్న పరిస్థితులకి తగినట్టు అని మార్పు చేసుకోకపోవడం కూడా ప్రధాన కారణం.
చాలామంది మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మారకుండా ఉంటారు. చాలా విషయాల్లో అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. మార్పుని గమనించాలి. మారిన పరిస్థితుల ప్రకారం మసలుకోవాల్సి వుంటుంది.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత జీవనశైలి మారిపోయింది. చాలా పనులు సులువుగా మారిపోయినాయి.
ఈమధ్య ఓ కథ చదివాను. ఉపయోగం గురించిన కథ అది.
కేసీ అనేది ఓ పక్షి. అడవిలో వుంటుంది. దాని రెక్కలు చిన్నవి. శరీరం పెద్దది. పేరుకి అది పక్షే కానీ అది ఎగరలేదు. అడవిలో చెట్టు నుంచి రాలిపడిన పండ్లని తింటుంది. అడవి చుట్టూ తిరుగుతుంది.
మిగతా పక్షులు కేసీని చూసి నవ్వుకునేవి. మరికొన్ని జాలి పడేవి. కానీ ఈ విషయాలు కేసీకి తెలిసేవి కాదు.
కోడిగుడ్డుని చూసి మనం చాలా విషయాలని ఊహించుకోవచ్చు. అది బలం ఇస్తుందని, కోడిపిల్లలు అందులో నుంచి వస్తాయని ఇలా ఎన్నైనా ఊహించుకోవచ్చు.
మా చిన్నప్పుడు బ్రాయిలర్ కోళ్లు లేవు. జీవం లేని కోడిగుడ్లు లేవు. ఇప్పుడు మనం నాటుకోడి అని మనం వేటినైతే అంటున్నామో ఆ కోళ్లే వుండేవి.
ఫ్లాట్ నుంచి విల్లాకు మారి ఓ ఆరుమాసాలు అవుతోంది. గృహ ప్రవేశం చేసినప్పుడు మా అన్నయ్య కొడుకు శివప్రసాద్ అమెరికాలో వున్నాడు. అందుకని కొత్త ఇంటికి రాలేకపోయాడు. ఓ పూజ వుంది రమ్మని పిలిచాను. ఓ రెండు మూడు రోజులు మాతో గడిపే విధంగా వచ్చాడు. నాకన్నా రెండు సంవత్సరాలు చిన్న అతను.
కొంతమంది కుక్కలని పెంచుకుంటారు. మరి కొంతమంది పిల్లులని పెంచుకుంటారు. ఇంకా కొంతమంది అక్వేరియమ్‌లలో చేపలని పెంచుతారు.
పావురాలని, పక్షులని పెంచుకునే వాళ్లు ఎందరో.
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది.
మనుషులని పెంచడం కొంతమేరకు మాత్రమే ఉంటుంది. వాళ్లు కాస్త పెద్దవాళ్లు అయిన తరువాత స్వేచ్ఛా జీవులుగా మారిపోతారు.
పెంపుడు జంతువులు వేరు. మనుషులు వేరు.
సృష్టిలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. యువకుడిలాగా ఎవరూ ఎప్పుడూ వుండలేరు. వయస్సు వస్తుంది.
ఈ మధ్య వార్తాపత్రికలో ఓ వార్త చూశాను. ఓ వ్యక్తి బొమ్మ చూశాను. గతంలో అతను ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారి. ప్రధాన సమాచార కమిషనర్‌గా పని చేశారు. కానీ ఇప్పుడు అతను అన్నీ మరిచిపోయాడు. అతన్ని చూడటానికి ఇద్దరు ముగ్గురు మనుషులు అవసరం ఏర్పడినారు.
కొన్ని ఉద్యోగాలు పదవులు మనకు కొన్ని పరిమితులని ఏర్పాటు చేస్తాయి. ఆ పరిమితులకి లోబడి పని చేయాల్సి ఉంటుంది.
1989లో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. జిల్లా జడ్జిగా వుండి జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పనిచేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
ఈమధ్య ఓ మిత్రుడు ఓ బొమ్మను షేర్ చేశాడు. అది 1914వ సంవత్సరంలో నిజాం నవాబు కట్టిన గెస్ట్ హవుజ్. ఇప్పుడు దాన్ని తీసివేసి, దాని స్థానంలో కొత్తది కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాన్ని ఆపాలని అతని ఉద్దేశం. హెరిటేజ్ భవనంగా అది ఉంచాలని అతని భావన.
ఈ మెసేజీ సరిగ్గా నేను వేములవాడలోని మా ఇంటిని చివరిసారి చూసి వస్తున్నప్పుడు వచ్చింది.
మన జీవితం ఓ ఆటలాంటిది.
ఆటలా మనం భావించాలి.
ఆటలో గెలుపులూ వుంటాయి.
ఓటములు శుంటాయి.
గెలుపు సంతోషాన్ని ఇస్తుంది.
ఓటమి నిరుత్సాహాన్ని ఇస్తుంది.
నిజానికి ఓటమి గెలుపునకు పునాదిగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుడుంటే మనం గెలుపు వైపు ప్రయాణం చేస్తాం.
జీవితంలో గెలుపు ఓటములు సహజంగా వుంటాయి. అయితే చాలా మంది ఓటములను గుర్తుకు తెచ్చుకొని బాధ పడుతూ ఉంటారు.