S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/09/2019 - 20:17

ఒక కొమ్మకు పూచిన పువ్వులు
ఒక రెమ్మను విరిసిన నవ్వులు
కవలంటి కలువలంటి వింటి శరాలు
ఇరుకన్నుల మెరిసిన దివ్వెలు
కళామతల్లి ఇరు కన్నులు విరిమల్లెలు
సంగీత సాహితీ సుమాలు
చెవులూరిన కవన వనాల
సంగీత సాహితీ ప్రియ జనాలు
సౌరభించే ఎల్లెడల ఆ దివ్య పరిమళాలు
విని తరించి వికసించగ దిగ్దిశాంతాలు.

03/02/2019 - 20:01

నేడే మాఘ కృష్ణ చతుర్దశి. మహాశివరాత్రిగా జగత్ప్రసిద్ధి పొందిన మహాపర్వదినం. హరహర మహాదేవ శంభో! శంకరా! నమః శివాయ అంటూ భక్త జనులందరు భక్తి పారవశ్యంతో ఎలుగెత్తి పలికే శివనామోచ్చారణలు కైలాసం వరకు వ్యాపించి ప్రతిధ్వనించే మహాశివరాత్రి పర్వదినమిదే.

03/02/2019 - 19:58

భగవాన్ విశ్వయోగి విశ్వంజీ 75 వ జన్మదినోత్సవం

03/02/2019 - 19:52

ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వేల భాషలు మాట్లాడుతున్నారు. వీటిలో కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే తెలిసిన భాషలు 46 ఉన్నాయి. అంటే ఆయా ఆయా భాషల్లో మాట్లాడేవారు ప్రస్తుతం ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాష మాండరిన్.. ఈ భాషను దాదాపు వందకోట్ల మంది మాట్లాడుతున్నారు. ఇన్ని వేల భాషల్లో అత్యంత సమర్థమైన భాష ఏదన్నది కనుగొనేందుకు కొందరు పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

03/02/2019 - 19:44

అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే అల్లాదుర్గం గ్రామ శివారులో వెలసిన శ్రీ బేతాళ స్వామి నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఇక్కడ ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ లక్షలాది మందిని తన్మయత్వానికి గురిచేస్తాయి. బేతాళుడు అంటే భూత, ప్రేత, పిశాచాలకు అధిపతి. అలాంటిది ఆయనను దైవ స్వరూపంగా ఎందుకు పూజిస్తారనే ప్రశ్నలు తలెత్తడం సహజం.

03/02/2019 - 19:35

ప్రశాంత వాతావరణం.. కాలుష్యానికి, జనవాసాలకు దూరంగా అభయారణ్యం. పక్షుల కిలకిలారావాలు.. పురివిప్పి ఆడే నెమళ్ల కేరింతలు. చుట్టూ కొండల మధ్య నుండి జాలువారే సెలయేరు.. ఆధ్యాత్మికత ప్రతిఒక్కరిలో ఉట్టిపడి భక్త్భివం ఉప్పొంగే ప్రాంతం. ఎతె్తైన గుట్టల నడుమ భారీ వృక్షాలు. ఆహ్లాదం, భక్తుల పారవశ్యం మధ్య విశిష్టత కలిగిన శివాలయం.

03/02/2019 - 19:31

భారత దేశ ప్రాచీన సంస్కృతీ సభ్యతలకు నిలయంగా, సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా, వేదవేదాంగ, శాస్త్రాగమ, నృత్య గీత నాట్యాది సకల కళలయందు నిష్ణాతులైన ధార్మిక కార్యాచరణాసక్తులైన ప్రజానీకంతో, మరెచ్చటా కానరానన్ని ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న పలు దేవాలయాల సముదాయం కలిగి, రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రాచీన పవిత్ర గోదావరీ తీరస్థ తీర్థంగా, పుణ్య క్షేత్రంగా మిగుల ప్రాచుర్యం పొందింది నాటి అవిభక్త కరీంనగర్,

03/02/2019 - 19:26

శిరసుపై నెలవంక దీపమై వెలుగగా
మారేడు త్రిదళాల నీ పూజ చేయగా
గంగమ్మ తలపైన
గిరి తనయ సగమైన
జంగమయ్యా నువ్వు జగమేలు దేవుడవు.
శివశివా
నీవు త్రిపురసంహారివి
త్రిజగ సంచారివి
కైలాస గృహ నిలయ
గిరిజాంతరంగా
కామన్న పున్నమన నీ ధవళ కాంతి
ఎప్పుడూ నిను చూచు భాగ్యాల నంది
ముప్పొద్దులా నిన్ను మ్రొక్కేము మేము.

03/02/2019 - 19:26

సీ.రుద్రుడై కరుణాసముద్రుడై నిత్యస
త్యానంద ముద్రుడై యలరునెవడు?
ఈశుడై సర్వలోకేశుడే, తాండవ
కేళీ విలాసుడై క్రాలునెవడు?
త్రిభువన భర్తయై, దివిజ గంగావేగ
హర్తయై వర్థిల్లు కర్త ఎవడు?
శూలియై ఘనకీర్తి శాలియై సంచిత
పాప నిర్మూలియై పరగునెవడు?

03/02/2019 - 19:24

పరమశివుడు భక్తుల శ్రేయస్సును మదిలోనెంచి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రకటితుడైనాడు. వాటిలో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం. 2. శ్రీశైలంలో మల్లికార్జున, 3. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం, 4. ఓంకారేశ్వర లింగం, 5. కేదారేశ్వర లింగం, 6. భీమేశ్వర జ్యోతిర్లింగం, 7. కాశీలో శ్రీ విశే్వశ్వర లింగం, 8. త్య్రంబకేశ్వర లింగం, 9. వైద్యనాథేశ్వర లింగం, 10. దారుకవనంలో శ్రీనాగేశ్వర లింగం, 11.

Pages