S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/02/2019 - 18:54

ఇత్తడి పాత్రల్లో అత్తెసరు తిన్న శక్తి సంపన్నమైన జాతి మనది ఒకనాడు. ఆంగ్లేయుల పుణ్యమా అని సిల్వర్ పాత్రలు ప్రవేశించి జాతి నిర్వీర్యమైపోయింది. ఆనాడు ఉన్నవాడు ఇత్తడి పాత్రల్లో, లేనివారు కుండల్లో వండుకునేవారు. రెండూ ఆరోగ్యప్రదమైనవే.. పదార్థాల్లోని సారాన్ని నాశనం చేసే జర్మన్ సిల్వర్ పాత్రలకు తోడు దిక్కుమాలిన కుక్కర్లు వచ్చిపడ్డాయి. అందులో అంతా కుక్కటమే.. ఎంత కుక్కినా అన్నంతో పాటు పప్పో, కూరో ఒకటే..

02/02/2019 - 17:34

పేదరికం వల్ల తాను చదువుకోలేకపోయినా.. వందలాది మంది బీదపిల్లలకు ఆయన తన కష్టార్జితంతో విద్యాదానం చేస్తున్నాడు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి పూర్తికాక ముందే సంపాదన బాట పట్టాడు.. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ‘టీ’ దుకాణం నడుపుతూ సమాజం కోసం తనకు తోచినంత సేవచేస్తూ.. ఇపుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించాడు..

02/02/2019 - 17:28

కొమ్మ కొమ్మలా గుబురు రెమ్మలా
స్వర కోయిల కూయలా.. ఇలా.. ఇలా..
కులుకులమ్మ కోయిలమ్మ
ఊరకనే ఊచలా
సరాగాల ఊయల.. చిరుగాలుల
చిగురాశల...
కలువ కన్నుల కనుల వెనె్నల-
చిరుగాలులింతేరా చిరాకులెందుకురా
పచ్చబొట్టు తెంచుకురా
ఆవలొడ్డు ఎంచుకురా
సరిగమల కలకల గలగల
మిలమిలలా జలజల
కనులింతలా.. తనువంత పులకింతలా...

01/29/2019 - 01:17

రోజు చివర్లో సినిమా చూసి కొందరు, వార్తలు చూసి మరి కొందరు నిద్రపోతుంటారు.
ఇట్లా ఎన్నో చెప్పవచ్చు.
కానీ-
రోజు చివర్లో ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్న వేసుకుంటే జవాబుని ఆలోచించవచ్చు.
ఈ రోజు ఏం చేశాం? అన్న ప్రశ్న అవసరం. మన జవాబుతో రేపు ఏం చెయ్యాలో బోధపడుతుంది. ఏం చేయకూడదో కూడా అర్థమవుతుంది.
మన శక్తిసామర్థ్యాల మేరకు మనం పని చేశామా?

01/28/2019 - 22:43

శా. జాతీయోద్యమ శాంతి భాస్కరుడు, వివ్వస్తవ్య మేథావి, సం
పూతాంతర్యుతు డాంగల పాలక జన వ్యూహాల భేదించెడున్
నీతిన్నిత్యము బోధజేయు మతి సందీపించు సన్మూర్తి, మా
నేతంచున్ నుతియింపగా మెలగు గాంధీ బాపుజీ జాతికిన్

01/28/2019 - 22:27

నీ చిరునామా...
ఎదలో రూపం ఒదగదె పాపం
తొలి వలపెంతో అపురూపం
మొగ్గగ మొదలై సిగ్గుల కళలై
విరిసిందెపుడో ప్రణయం
మురిసిందెపుడో హృదయం
చూపు చూపు కలిశాక
మనసు మనసు వలచాక
రెప్పలార్చితె వలలౌతుంది
దిక్కులెతికితె తలలౌతుంది
కలల అలలపై కళల పానుపై
కరిగేదెపుడో ప్రణయం
అణిగేదెపుడో సమరం
ఎదలో కలిగితె ఏదో ఆశ

01/26/2019 - 23:03

తాననుకొన్నట్టే జరుగుతున్నందుకు కృష్ణుడు లోలోపలే నవ్వుకుంటూ, ‘‘ప్రియతమా! అంతకంటే భాగ్యమా? నీ మాటకు తిరుగా? ఇదిగో కొంచెం వంగుతున్నాను. మెల్లిగా నా భుజాల మీదికి ఎక్కు’’ అంటూ చేతులు నేలకు ఆనించి, ముందుకు వంగాడు.
ఆ వగలాడి తన అదృష్టానికి తనే పొంగిపోతూ, ఎక్కడ లేని కులుకులూ కులుకుతూ, చీర సవరించుకుంటూ, వెనక్కి తిరిగి స్వామి మీద ఎక్కి కూర్చోబోయింది.

01/26/2019 - 22:59

వీధుల్లో భారీ రథంపై కంస మహారాజు ఊరేగింపు.. నదీ తీరాన గోపికల నడుమ శ్రీకృష్ణుడి లీలలు.. మరో కూడలిలో వేదికపై కంస-కృష్ణుల పోరాట దృశ్యాలు.. ఇంకో చోట శ్రీకృష్ణుడి చేతిలో కంసుడి వధ.. రాక్షస పాలన విరగడైనందుకు జనం కేరింతలు.. ఈ దృశ్యాలు పదకొండు రోజుల పాటు అక్కడి ప్రజలను విశేషంగా అలరిస్తాయి..

01/19/2019 - 23:43

ఉదయం లేవగానే చా లామంది అద్దంలో తమ మొఖం చూసుకుంటారు. అద్దం కన్పిస్తే తమని తాము చూసుకుంటూ మురిసిపోతారు. దువ్వెన తీసి అద్దంలో తమని తాము చూసుకుంటూ దువ్వుకుంటారు. సినిమా థియేటర్లలోని వాష్‌రూంల్లో కూడా చాలామంది ఈ విధంగానే చేస్తూంటారు. లిఫ్ట్‌ల్లో కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఒక్కరే ఉంటే చాలు. తమని తాము చూస్తూ సరిదిద్దుకుంటూ వుంటారు.
దువ్వుకుంటారు.

01/19/2019 - 20:33

ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువులు కాసేపట్లో హోమ్ డెలివరీ కావాల్సి ఉంది. కానీ అర్జెంటు పనిపై మరో ఊరికి వెళ్లాలి. అందుబాటులో ఎవరూ లేరు. రెండు పనులూ అత్యవసరమే.. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఒకటి కావాలంటే మరోటి త్యాగం చేయాల్సిందే.. అనుకుంటాం. ఇలాంటి సందిగ్ధ పరిస్థితులను అమెజాన్ అర్థం చేసుకుంది కాబోలు.. మరింత మెరుగైన హోమ్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేసింది. అదే అమెజాన్ ‘కీ’ సర్వీస్.

Pages