S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/02/2019 - 19:19

ఒకటే
చీకటిలో
అన్ని రంగులూ ఒకటే
స్మశానంలో
అన్ని కులాలూ ఒకటే

* జగమంతా దగాదగా
మోసమే బతుకుదెరువైన
లోకంలో
ప్రతి జేబులోను
పాపపు సొమ్మే

* హామీ
గెలిపిస్తే పేదరికం
తొలగిస్తానన్నాడు
తీరా గెలిచాక
పేదల్నే పైకి పంపిస్తున్నాడు
ఎలాగైతేనేం
హామీ నెరవేరుస్తున్నాడు

03/02/2019 - 18:58

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి భార్యామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే
అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.

03/02/2019 - 18:53

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధపడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు.

02/23/2019 - 21:47

సద్గురు జగ్జీ వాసుదేవ్ అనేక చోట్ల ప్రసంగాలు చేశారు. మానవాళికి అందించిన ఆయన బోధనలు ‘ఆణిముత్యాల’ల్లా ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం...
* ఆశలు పెంచుకోండి, వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయండి. అల్పత్వాన్ని పెంచుకుని ఆశలు చంపుకుంటే జీవితంలో మీరు దేన్నీ సాధించలేరు.
* కోరికలకు హద్దు ఉంటే సంతోషంగా జీవిస్తారు. ఆశ ఉండాలి కాని అది అత్యాశగా మారకూడదు.

02/23/2019 - 20:37

నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన చిత్రకారిణి అమిలారెడ్డి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ముఖ్యంగా మహిళలను తన కాన్వాసుపై వినూత్న రీతిలో చిత్రించడంతో తనదైన శైలిని చిత్రకళా ప్రపంచానికి చాటి చెప్పారు.

02/23/2019 - 20:30

ఈ శాస్ర్తీగారు ఉత్తరదేశీయులు. ఆయన తమ పురాణతత్త్వ దర్శనంలో ఇలా వ్రాశారు -
‘‘మేము దర్శించిన యోగి బీహారులోని సారన్ జిల్లావారు. సంస్కృతంలో శ్లోకబద్ధంగా మాట్లాడేవారు. వారొకసారి తమ మూత్రద్వారం ద్వారా నూనెను పిచికారీ లాగా లోపలికి పీల్చుకోవటాన్ని ప్రదర్శించారు.
‘‘అది చూసి ఆశ్చర్యచకితులైన మేము, ఆయనను అనేక విధాలుగా ప్రాధేయపడగా వారిలా చెప్పారు -

02/23/2019 - 20:14

ప్రపంచ ప్రఖ్యాత వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన జన్మించి చాలాకాలం నివసించిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి ఫిబ్రవరి, 8, 2019 న వెళ్లాను.

02/23/2019 - 19:49

యాదవుల విశిష్ట దైవం శ్రీకృష్ణుడంటారు. కానీ, శివమెత్తి ఊగుతారు. శివుడు శాకాహారే.. భక్తులు మాత్రం బలి దానాలతోనే మోక్షమొందుతారు. కులదైవంగా వినతికెక్కి.. సర్వజన జాతరగా భాసిల్లే దురాజ్‌పల్లి భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాల సమ్మేళనం. తెలంగాణాలోనే సమ్మక్క సారలమ్మ జాతరంత ప్రాచుర్యం పొంది గొల్లగట్టుగా భాసిల్లుతూ అందరికి వరాలనొసగే పెద్దగట్టు...అనేక విశిష్టతల పుట్ట!

02/23/2019 - 19:01

నా పాటకు పల్లవి వేరు
నా బాట సెలయేరు.. ఆశల యేరు..
నా పాట అందరూ పాడుకోవాలని
ఆ బాటను నడిచి రావాలని
దశాబ్దాలుగా ఆరాటము...
సమజీవన సహ భావన పోరాటము...
ఇది ఎంత మాత్రము స్వార్థము
కాదు పరమార్థము
సెలయేరులా ఆశల యేరులా
ముందు కురికించినా
ఎంత మరపించినా
అది ఓ కరగని శిలా!!
మరి ముందుకు కదలదు ఎలా?!

02/23/2019 - 19:00

ముదిమి ముంచుకొచ్చిన మీకు
పసికందులు కావలెనా!
కామ దహనానికి కనులు - మనసుల్లేవా?
స్ర్తిజాతి ఎదుగుదలని పిందెలోనే రాల్చెదరా
మొగ్గలోనే తుంచెదరా!!
వెధవల్లారా.. మీకెందులకీ పెనుకామం...
తెలియదా అది ప్రగతికి పెనుఘాతం...
మితిమీరిన గతి తప్పిన కామాన్ని
మీలోనే ఎందుకు సమాధిచేరాదు
నినె్నందుకు సజీవ దహనం చేరా

Pages