S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/19/2019 - 20:31

వాళ్ళు మొదటినుంచీ మధురభక్తి మార్గంలో ఉపాసన చేస్తున్నవాళ్ళు కనుక, స్వామితో మాట్లాడేటప్పుడు శృంగారపరంగా మాట్లాడుతూ వుంటారు. కానీ, వారు కోరేది ఆత్మసంయోగ రూపమైన శృంగారమే కానీ, శారీరక శృంగారం కాదు. అందుకే, వారు తమ స్తనాల మీదా, శిరస్సు మీదా, చేయి వుంచమని చెప్పగానే, వారు యోగప్రక్రియలో శక్తిపాతాన్ని కోరుతున్నారని పరమాత్మ అర్థం చేసుకున్నాడు. లౌకిక శృంగారమైతే నెత్తిమీద చెయ్యి పెట్టమని కోరరు కదా?

01/19/2019 - 20:28

కొమ్మ మీద కోయిలా
కుహుకుహు గీతికలా
గుండెలో హాయిలా
ఇలా ఇలా ఊచే సరాగాల ఊయల
ఆ వలపు ఆ తలపు మైమరపు
ఊసుపోక రాయలా.. ఊహలతో
కవిత ఇలా ఇలా
తను...
నా తనువు మనసు తపన తపసు
కడలిపై అలలా అలలపై కలలా
కదిలే వెనె్నల వెలుగై నా కన్నుల
పుచ్చ పువ్వులా.. విచ్చి వెనె్నల్లా...
కాటుక కళ్ల వాకిళ్లు
ఆ కామునికవి పొదరిళ్లు

01/19/2019 - 19:54

మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలన్నారు ఓ సినీ రచయిత. కానీ, ప్రతి మనిషికి పుట్టుకతోనే దేవుడు ఏదో ఒక ప్రతిభ, కళ, గొప్పదనాన్ని ప్రసాదిస్తాడనేది భగవంతుడ్ని నమ్నే ప్రతి ఒక్కరి విశ్వాసం. ఈ రెండు అంశాలను విశ్వసిస్తూ తన మధుర గానాలాపనతో అందర్నీ మంత్రముగ్దులను చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ పవన్. కొందరు పుట్టుకతోనే తమ ప్రత్యేకతను చాటుకోగా, మరికొందరు తమ వారసత్వ సంపదగా, మధ్యలో కళాంశాలపై ఆకర్షితులై రాణిస్తున్నారు.

01/19/2019 - 18:46

విదేశీ ప్రయాణం చేసేముందు మనం ఎన్నోసార్లు పాస్‌పోర్ట్ చెల్లుతుందా? లేదా? అని మరీ మరీ చెక్ చేసుకుంటాం కదా.. ఈ క్షణంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ పనిలోనే ఉండి ఉంటారు. పాస్‌పోర్టులు ఏ రంగులో ఉన్నా, వాటిపై ఎలాంటి స్టాంపులున్నా అవన్నీ ఒకే కథను వివరిస్తాయి. ప్రపంచాన్ని చుట్టి రావడానికి అవసరమైన ఈ ముఖ్యమైన పత్రాల గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటంటే..

01/12/2019 - 23:31

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేని మనిషి కన్పించడం లేదు. ఎవరిని చూసినా వాళ్లు మొబైల్‌ని చూస్తూనో మాట్లాడుతూనో కన్పిస్తున్నారు. ఇది ఈ రోజుల్లో కనిపిస్తున్న దృశ్యం.
మనుషుల్తో వ్యక్తిగతంగా మాట్లాడటం తగ్గిపోయింది. ఫోన్‌లో మాట్లాడటం పెరిగిపోయింది.

01/12/2019 - 23:20

తే.గీ. భోగిమంటల వెలుగులో మూఢ జనుల
మలిన భావాలు చేతలు మాసిపోయి
స్వచ్ఛతా పరీమళములు పరిఢవిల్లి
వచ్చెనదిగొ సంక్రాంతి సౌభాగ్యలక్ష్మి!

01/12/2019 - 20:20

నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు టెక్ కంపెనీలు సరికొత్త పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. గగనతలంలో రివ్వున దూసుకెళ్లే స్కై టాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ టాక్సీలను అందుబాటులో తెచ్చేందుకు దుబాయి సిద్ధమవుతోంది.

01/12/2019 - 20:16

(iii) ఈ మాటలేమిటో అర్థం కాక, ఆ గోపికలు తత్తరపడుతుంటే - ఆయన మళ్ళీ కొంచెం ఆగి-
(iv) ‘‘ఇది అర్ధరాత్రి. ఇది క్రూరమృగాలు విచ్చలవిడిగా తిరిగే చోటు. ఇంత సాహసించి మీబోటివాళ్ళు ఇక్కడికి రావచ్చా?’’ - అన్నాడు.
(v) ఈ మాటలకు గోపికలందరూ బిత్తరపోయారు.
(vi) అయినా స్వామి ఆగలేదు. ఆయన ఇంకా ఇలా అన్నాడు-

01/12/2019 - 20:10

మోగెలే ఎదను సితార సాగెలే
హృది రస అసిధార
పాడెలే కొమ్మలనూగెలే ఆడెలే గండుకోయిల
ఊగే కొమ్మల తూగాడే పూవుల సుమ
సుగంధ పరిమళాల సౌరభాల...
కన్నె వధువులా గుండె మధువులా..
సాగిపోసాగే లేలేత కడలి కెరటాల
చిరుగాలి రెపరెపలా పైట చెంగు పెరపెరలా
పురివిప్పిన ఆ వయసుల
రెపరెపలాడే నీలికన్నుల
మొగ్గగ విరిబుగ్గల సిగ్గుగ ముసినగలై

01/12/2019 - 19:05

ఆకాశంలో చందమామ..
నేలన మెరుస్తోంది!
నెలవంకై..
అమ్మ పెట్టిన ముగ్గులో..
కళ్లాపి చల్లిన వాకిళ్లు..
కల్యాణ తిలకమద్దుకున్నట్లు..
నేలంతా రంగురంగుల చిత్రాలు..
ఊరంతా సంక్రాంతి ముగ్గులు..
ధరణికి దరహాస శ్రీకారం
మగువుల కరవిలాస సాకారం
ప్రతీ ధనూర్మాసమందూ!
నేలే విరిసిందా?
నింగే నేలపై మురిసిందా!?
ఇంటింటా ముగ్గులు

Pages