S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2016 - 15:33

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రెండో బ్లాకులో హోం శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర హోం మంత్రి ఎన్.చినరాజప్ప గురువారం ప్రారంభించారు. ఇక్కడి నుంచే తమ శాఖ కార్యకలాపాలన్నీ జరుగుతాయని ఆయన తెలిపారు. డిజిపి ఎన్.సాంబశివరావు, పోలీసు శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

08/04/2016 - 15:33

చిత్తూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టిడిపి నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరి నియోజకవర్గంలో గురువారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన 15వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఎపి ప్రజలు కోరుతున్నారని అన్నారు.

08/04/2016 - 12:12

హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఇక్కడ ఎపి సచివాలయంలో రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

08/04/2016 - 12:12

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో, సమర్ధతతో పనిచేయాలని, ప్రజాసేవకు ఇదొక అరుదైన అవకాశమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా, పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సదుపాయాలు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదన్నారు.

08/04/2016 - 12:11

అనంతపురం: ప్రసన్నాయపల్లి వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు రిలయన్స్ సంస్థలో ఇంజనీర్లుగా, మరొకరు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు గిరిగా పోలీసులు గుర్తించారు. సునీతకు వరసకు అల్లుడైన గిరి మరణించడంతో పెద్ద సంఖ్యలో సమీప గ్రామాలవారు ప్రమాద స్థలానికి వచ్చారు. మంత్రి సునీత హుటాహుటిన ప్రసన్నాయపల్లికి వచ్చి గిరి తల్లిదండ్రులను ఓదార్చారు.

08/04/2016 - 12:11

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్టప్రతి, పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. ఈనెల 12 నుంచి జరిగే కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా వీరిని ఆహ్వానిస్తారు.

08/04/2016 - 12:10

ఒంగోలు: ఆర్టీసీ బస్సు, సిమెంటు లోడ్‌తో వెళుతున్న లారీ పరస్పరం ఢీకొనడంతో 23 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సంతమాగలూరు వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వినుకొండ నుంచి నరసారావుపేట వెళుతోంది.

08/04/2016 - 08:10

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

08/04/2016 - 08:02

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి అన్ని పక్షాలను కలుపుకుని పోరాడకుండా, అరటాకులా నలిగిపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం అత్యంత విచారకరమని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విభజన సమయంలో రక్తం మరుగుతోందని చెప్పారని, ఇప్పుడు మరిగిన రక్తం ఆవిరైందా అని బాబును నిలదీశారు.

08/04/2016 - 08:02

కర్నూలు, ఆగస్టు 3: మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి శుక్రవారం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఇప్పటికే నిండినందున వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేయనున్నారు.

Pages