S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/06/2016 - 01:17

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 5: నాగార్జునసాగర్ జలాశయం నుండి కృష్ణాడెల్టాకు శుక్రవారం రాత్రి నుండి నీటివిడుదలను జెన్‌కో అధికారులు ప్రారంభించారు. కృష్ణాడెల్టా పరిసర ప్రాంతాలలో తాగునీటి అవసరాల నిమిత్తం 4టిఎంసిల నీటిని విడుదల చేసే విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయంకు నీటివిడుదల చేస్తున్నారు.

02/06/2016 - 01:16

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఒక కేసు విచారణ ప్రారంభమైన తర్వాత నిందితులకు సమన్లు జారీ చేయరాదని కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది పి చిదంబరం హైకోర్టులో వాదించారు. జగన్ అక్రమాస్తుల కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు విచారిస్తున్న సంగతి విదితమే. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ తరఫున చిదంబరం శుక్రవారం హైకోర్టులో వాదించారు. ఈ కేసులో నిందితుడిగా దాల్మియా సిమెంట్స్ ఎండి పునితా దాల్మియా ఉన్నారు.

02/06/2016 - 01:15

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెన్షన్ పథకం (సిపిఎస్) వర్తించు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ వివరాలు త్వరలో ఖజానా శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) తెలిపింది.

02/06/2016 - 01:15

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆంధ్రా లో సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ కోసం ఇ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇ -నిధి వ్యవహారా లు చూసేందుకు స్టీరింగ్ కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా ఐటి సలహాదారు వ్యవహరిస్తారు.

02/06/2016 - 01:14

హైదరాబాద్, ఫిబ్రవరి 5: జగన్ అక్రమాస్తుల కేసులో ఈ నెల 29వ తేదీ వరకు విచారణ జరపరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 29వ తేదీలోగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బదలాయించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించాలని హైకోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో జారీ చేశారు.

02/06/2016 - 00:54

ఇది చారిత్రక విజయం
నగరంలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం
పేదల అజెండానే తెరాస లక్ష్యం
అందరూ మా బిడ్డల్లాంటి వాళ్లే
విపక్షాలది నిర్మాణాత్మక పాత్ర కావాలి
కొత్తగా మూడు వెయ్యి పడకల ఆస్పత్రులు
మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తాం
ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్ఘాటన

02/06/2016 - 00:54

99 డివిజన్లు తెరాస కైవసం
అడ్రస్ గల్లంతైన విపక్షాలు ప్రాబల్యం తగ్గని మజ్లిస్
పాతబస్తీలో తెరాస బోణీ మేయర్ పీఠంపై గులాబి జెండా
ఇదో చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో మరో చరిత్ర. తెరాస సాధించిన
ఘన చరిత్ర. బల్దియా ఎన్నికల్లో తెరాస విజయం అపూర్వం.
అనన్య సామాన్యం. ఒకే ఒక్కడుగా తెలంగాణ సాధించిన కెసిఆర్,
మహానగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ నిరుపమాన శక్తీ, యుక్తి

02/06/2016 - 00:52

కాకినాడ, ఫిబ్రవరి 5: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలోని తన ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించారు. భార్య పద్మావతి సైతం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. తొలిరోజు ముద్రగడ దంపతులకు మద్దతుగా కుటుంబీకులు దీక్షలో కూర్చున్నారు.

02/06/2016 - 00:52

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సిఎం చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు చంద్రబాబు రెండు రోజుల నుంచి విశాఖలోనే బస చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారు. ఓపక్క ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. అంతర్జాతీయంగా అందరి కళ్లూ ఆంధ్రపైనే ఉన్నాయి.

02/06/2016 - 02:22

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: సముద్ర జలాల్లో విధ్వంసానికి కుట్ర పన్నుతోన్న ఉగ్రవాద ఆగడాలు అరికట్టేందుకు నౌకాదళం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా శుక్రవారం జాతీయ, అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Pages