S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/03/2017 - 03:10

ఖమ్మం, జనవరి 2: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు తెలిపారు. సోమవారం వారు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

01/03/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 2: ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాకాని చక్రపాణి (74) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారం మంగళవారం ఉదయం పద్మారావునగర్‌లో జరుగుతుందని కాకాని సన్నిహిత స్నేహితుడు డాక్టర్ చంద్రశేఖరరెడ్డి చెప్పారు.

01/03/2017 - 04:01

విజయవాడ, జనవరి 2: నమ్మకం అనేది మనుషులను ఉన్నత స్థానానికి తీసుకెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఇక్కడి దుర్గాఘాట్ వద్ద జరిగిన దివ్యదర్శనం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని మతాల వారు తమ మతవిశ్వాసాల ప్రకారం ఆయా ఆలయాలకు, ప్రార్థనామందిరాలకు వెళ్లి పూజలు చేస్తారన్నారు.

01/03/2017 - 02:05

కర్నూలు సిటీ, జనవరి 2: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అవి అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అలాంటి గ్రామాలను అభివృద్ధి చేసేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

01/03/2017 - 02:06

నందికొట్కూరు, జనవరి 2: రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా రాజధానిలో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ప్రారంభించిన సందర్భంగా సిఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమానమేనన్నారు.

01/02/2017 - 04:22

యాదగిరిగుట్ట, జనవరి 1: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆదివారం దానికి తోడు 2017 నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పంచనారసింహులను దర్శించి పునీతులయ్యారు. వేకువజామున 3గంటలకే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు శ్రీ స్వామిని మేల్కొలిపి నిత్యపూజలు చేపట్టారు.

01/02/2017 - 03:42

తిరుపతి, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లువయ్యేలా అడుగడుగునా తిరుమల భక్తులకు కలియుగ వైకుంఠంగా దర్శనమిచ్చింది. ఆదివారం జనవరి 1, ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు పోటెత్తాయి.

01/02/2017 - 03:41

హైదరాబాద్, జనవరి 2: భారతదేశం 2017 లో అంతర్జాతీయంగా కీలకస్థానంవైపు వెళుతుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రపంచంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అదుపు చేసేందుకు భారత్ చేసే కృషికి అంతర్జాతీయంగా మద్ధతు లభిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం సమసిపోయే అవకాశాలున్నాయని, శాంతి నెలకొంటుందన్నారు.

01/02/2017 - 03:17

ఖమ్మం, జనవరి 1: ఉక్కు ఖనిజ సంపద అపారంగా ఉన్న బయ్యారం ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖనిజ సంపద అక్రమంగా వేలకోట్ల విలువచేసే ఖనిజం ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళింది. అనేక ఆందోళనల ఫలితంగా దానిని అడ్డుకున్నారు.

01/02/2017 - 04:01

విశాఖపట్నం, జనవరి 1: కమిషన్ పద్ధతిలో పాత నోట్లు మార్చేందుకు యత్నించిన ఒక వైద్యునితో పాటు ఇద్దరు వ్యక్తులను విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.46 లక్షల విలువ చేసే రూ.2000 నోట్లు, మరో లక్ష రూ.100 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యునిగా పనిచేస్తున్న అనె్న శిరీష్ పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ సంపాదించాడు.

Pages