S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/10/2016 - 02:16

నెల్లూరు, జూలై 9: నెల్లూరు నగరంలో శనివారం పట్టపగలు దోపిడి దొంగ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. నగరంలో ఓ ఆడిటర్ ఇంట్లోకి శనివారం ఉదయం చొరబడి ఇంట్లో ఉన్న వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరులోని సాయినగర్ మొదటి వీధిలో నాగేశ్వరరావు, ప్రభావతి దంపతులు నివసిస్తున్నారు.

07/10/2016 - 02:08

హైదరాబాద్, జూలై 9: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన రష్యాలో ప్రారంభమైంది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా నగర నిర్మాణం, దాని అభివృద్ధిని చంద్రబాబు బృందం నిశితంగా పరిశీలించింది.

07/10/2016 - 01:06

మెడికల్ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం శనివారం నాడు నిర్వహించిన ఎమ్సెట్-2 ప్రిలిమినరీ కీని
కమిటీ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు వాటిని ఇ మెయిల్ ద్వారా
ఈ నెల 12వ తేదీలోగా తెలియజేయాలని కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు చెప్పారు.
అభ్యంతరాలనుkeyobjectionstseamcet2016@gmail.comకు ఫంపించాలి

07/09/2016 - 08:35

హైదరాబాద్, జూలై 8: సామాజిక అసమానతలకు తావులేని విద్యావిధానం దేశంలో అమలు కావాలని ఇక్ఫాయ్ యూనివర్శిటీ కులపతి, ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు డాక్టర్ సి రంగరాజన్ పేర్కొన్నారు. తాము సముపార్జించిన విద్యను, ఇతర నైపుణ్యాలను, భవిష్యత్‌లో దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడేలా వ్యవహరించాలని విద్యార్ధులను ఉద్దేశించి ఆయన ఉపదేశించారు.

07/09/2016 - 07:05

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఎమ్సెట్-2ను శనివారం నిర్వహించనున్నారు. 56,188 మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు శుక్రవారం నాడు చెప్పారు. ఆంధ్రాలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

07/09/2016 - 06:01

హైదరాబాద్, జూలై 8: ఇస్లాం మత పెద్ద జకీర్ నాయక్‌తో తాను కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడాన్ని బిజెపి నాయకులు వివాదాస్పదం చేయడం పట్ల ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో తీవ్రంగా ప్రతిస్పందించారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ళ కేసులో నిందితులైన ప్రయాగ్ ఠాకూర్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఒకే వేదికపై పాల్గొంటే తప్పులేదా? అని ఆయన ట్వీట్ చేశారు.

07/09/2016 - 05:39

హైదరాబాద్, జూలై 8: సరోజినీ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు వికటించి పలువురు చూపు కోల్పోయిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సుమోటోగా స్పందించి కేసుపై విచారణ ప్రారంభించాయి. లోకాయుక్త ఆదేశాలతో ఒక ప్రతినిధి బృందం శుక్రవారం ఆస్పత్రిని సందర్శించింది. వైద్యులు, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. బాధితులు ఎప్పుడు అసుపత్రిలో చేరారు?

07/09/2016 - 05:38

హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన మరో ఐఎస్‌ఐఎస్ అనుమానితుడిని నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సంతోష్‌నగర్‌లోని ఈద్ బజార్‌కు చెందిన నిజాముద్దీన్ పేలుళ్లకు కుట్రపన్నిన ఐదుగురికి సహకరించారనే అభియోగంతో ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీం సిమ్‌కార్డులు, మొబైల్‌ఫోన్లను తెలిసినవారి పేర్లమీద కొనుగోలు చేశాడు.

07/09/2016 - 05:08

హైదరాబాద్, జూలై 8: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఈనెల 21నుంచి తమ వాదనలు వినిపించాల్సిందిగా కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు విభజనపై గతంలో ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

07/08/2016 - 05:43

న్యూఢిల్లీ, జూలై 7: రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ బలోపేతానికి దృష్టిపెట్టిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల కోర్ కమిటీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు అమిత్ షా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ కోర్ కమిటి సమావేశం జరగనుంది. అందుకోసం గురువారం ఢిల్లీకి చేరుకొన్న ఏపీ బిజెపి నాయకులు ఢిల్లీలోని ఎంపీ కంభపాటి హరిబాబు నివాసంలో భేటీ అయ్యారు.

Pages