S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/30/2016 - 07:48

హైదరాబాద్, ఏప్రిల్ 29: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొచ్చువెల్లి-గౌహతిల మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మే 8, 15 తేదీల్లో నెం.06336 రైలు కొచ్చువెల్లి నుంచి బయలుదేరుతుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో మే 11, 18 తేదీల్లో నెం.06335 రైలు గౌహతి నుంచి బయలుదేరుతుందని తెలిపింది.

04/30/2016 - 07:47

కొత్తూరు, ఏప్రిల్ 29: సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంకు దీటుగా సిద్దాపూర్ గ్రామాన్ని అభివృద్ద్ధి చేసేందుకు సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు సిద్ధ్దంగా ఉన్నారని ఆయన భార్య నమ్రత శిరోద్కర్ వివరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాన్ని నమ్రత శిరోద్కర్ సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

04/30/2016 - 07:40

ఖమ్మం, ఏప్రిల్ 29: వచ్చే నెల 1, 2 తేదీల్లో జరగాల్సిన టెట్, ఎంసెట్ పరీక్షలను ఈ నెల 20వ తేదీలోగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1 టెట్, 2న ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం చేయటంతో ఆ కళాశాలలన్నీ జెఏసిగా ఏర్పడి పరీక్షకు సహకరించలేదన్నారు.

04/30/2016 - 07:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లో కేంద్ర సాకులు వెదకుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావువిమర్శించారు. పార్లమెంట్ అవరణలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావల్సిన నిధులు హామీల విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే 2018 నాటికి ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నించారు.

04/30/2016 - 07:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎపికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి వైకాపా సహకరిస్తుందని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ధ్యాస లేదని, ఎంతసేపూ వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలనే చూస్తున్నారని ఆయన విమర్శించారు.

04/30/2016 - 07:34

కాకినాడ, ఏప్రిల్ 29: కనీవినీ ఎరుగని రీతిలో భారీ అవినీతి తిమింగలం ఆస్తులు బయటి ప్రపంచానికి బహిర్గతమవుతున్నాయి. తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలను చూసేసరికి సాక్షాత్తూ అవినీతి నిరోధక శాఖాధికారులకే దడ పుడుతోంది.

04/30/2016 - 07:32

గురజాల/దాచేపల్లి, ఏప్రిల్ 29: పంట సంజీవని పథకం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలోని నడికుడిలో పంట సంజీవని పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలతో కొంత సమయం ముచ్చటించారు.

04/30/2016 - 07:31

విజయనగరం/విశాఖపట్నం, ఏప్రిల్ 29: మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ప్రభావిత రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణ అమలు చేయాలని నాలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

04/30/2016 - 07:28

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ‘దేవాలయాల్లో నిత్యం భగవంతునికి ధూప దీప నైవేధ్యాలర్పించే అర్చకులు ఉపాధి కూలీల పాటి చేయరా!, అర్చకులకు కనీస వేతనం అమలు చేయకుండా పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం’ అంటూ విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మండిపడ్డారు. నవ్యాంధ్ర అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు స్వామీజీని శుక్రవారం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

04/30/2016 - 07:15

విజయవాడ, ఏప్రిల్ 29: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని ఈ-సేవా కార్యాలయం పైఅంతస్తులో ఐటి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న శుక్రవారం ప్రారంభించారు.

Pages