S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/04/2016 - 07:49

హైదరాబాద్, మే 3: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయాధికారులను 52:48 ప్రకారం కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు న్యాయాధికారుల నుంచి ఆప్షన్లను రిజిస్ట్రీ ఆహ్వానించింది. 335 జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, 28 మంది రిటైర్డు న్యాయాధికారులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.

05/03/2016 - 05:10

మాచర్ల, మే 2: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్న తరుణంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి విమర్శించారు. సోమవారం గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన ‘కరవు దీక్ష’లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

05/03/2016 - 05:07

హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుండి వ్యాయామ విద్యను తప్పనిసరి చేస్తున్నామని కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటికే పాఠ్యాంశాల రూపకల్పన పూర్తయిందని, ప్రతి పాఠశాలలోనూ వ్యాయామ విద్యను బోధించేందుకు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

05/03/2016 - 05:06

విజయవాడ, మే 2: రాజధాని అమరావతిని నిర్మించే సంస్థను ఖరారు చేసేపనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ అయింది. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు.

05/03/2016 - 05:00

హైదరాబాద్, మే 2: కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు గతంలో జరిగిన భూ కేటాయింపులకు సంబంధించి తనపై సిబిఐ నమోదు చేసిన నేరారోపణలను కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి బిపి.ఆచార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజా ఎలంగో సిబిఐకి నోటీసులు జారీ చేశారు.

05/03/2016 - 04:44

కాకినాడ, మే 2: ఎపి ఎంసెట్-2016కు హాజరైన అభ్యర్ధులకు ఏ విధమైన అభ్యంతరాలున్నా ఈనెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని జెఎన్‌టియుకె స్పష్టంచేసింది. ఏప్రిల్ 29న ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు ప్రిలిమినరీ కీని జెఎన్‌టియుకె ప్రకటించింది.

05/03/2016 - 04:42

కడప/కర్నూలు/అనంతపురం, మే 2: రాయలసీమ జిల్లాల్లో సోమవారం కూడా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే ఆదివారం రాత్రి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. కడప నగరంలో సోమవారం 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 42.2, నంద్యాలలో 41.8, ఆదోనిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

05/03/2016 - 04:41

రాజమహేంద్రవరం, మే 2: సీలేరు జలాలపై ఆధారపడిన తూర్పు గోదావరి జిల్లాలోని మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో నేటి నుండి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తికి బ్రేకు పడింది. మంగళవారం నుండి 12 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలుపుదలచేస్తూ జెన్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

05/03/2016 - 04:38

విశాఖపట్నం, మే 2: విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రభుత్వం తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సుమారు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూముల్లో 3,500 ఎకరాలు రైతులకు చెందినవి కాగా, మరో 1,500 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.

05/03/2016 - 04:37

కర్నూలు, మే 2: కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ నేతలు గురి పెట్టారు. వారిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డిపై భారీ ఎత్తున ఒత్తిడి పెట్టారని, మరో వైపు నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది.

Pages