S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2016 - 06:15

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కలకలం మళ్లీ మొదలైంది. తాజాగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం గూడెంలో మూడు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పార్టీ బలోపేతంపై మావోయిస్టులు దృష్టిసారించారు. రెండు దళాల సభ్యులు కోటపల్లి మండలం నుంచి బెజ్జూరు వరకు సంచరిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది.

04/29/2016 - 06:09

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొనగా, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

04/29/2016 - 06:07

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశానికి ఏకీకృత పరీక్షను నిర్వహించాల్సిందేనని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ ఉత్తర్వులు వర్తిస్తాయా లేదా అనే మీమాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పడ్డాయి. సుప్రీం ఆదేశాలు అనేక సాంకేతిక కారణాల వల్ల ఈ రెండు రాష్ట్రాలకూ వర్తించవని ఓ పక్క న్యాయ నిపుణులు చెబుతూంటే దీనిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచి తూచి స్పందించాయి.

04/29/2016 - 06:06

హైదరాబాద్, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో పాల్పడిన అవినీతిపై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు టిడిపి సిద్ధపడుతుందా అని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను గత రెండేళ్లలో చంద్రబాబు, లోకేష్ అవినీతితో 1.34 లక్షల కోట్లను దోచుకున్నారన్నారు. చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారన్నారు.

04/29/2016 - 06:06

కాకినాడ, ఏప్రిల్ 28: ఎపి ఎంసెట్-2016ను ముందు ప్రకటించిన విధంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో యథావిథిగా నిర్వహిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. దేశంలో అన్నిరకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను ఒక కామన్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పద్ధతిలో ఎంసెట్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు.

04/29/2016 - 06:04

చింతూరు, ఏప్రిల్ 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పొంగుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఆ రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్సు జవాను మృతిచెందాడు. పొంగుట్ట అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సు (సిఎఎఫ్) పదవ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు.

04/29/2016 - 06:04

హైదరాబాద్, ఏప్రిల్ 28: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సేవకుల వంశీ మొదటి ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ భారతదేశంలో 118 నగరాలతో పాటు దుబాయ్, కువైట్, మస్కట్‌లలో కూడా ఈ ప్రవేశపరీక్షను నిర్వహించారు. విట్ ఫలితాలను గురువారం నాడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధ్ ప్రకటించారు.

04/29/2016 - 06:03

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఒకటో తేదీన విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత, తీసుకుంటున్న జాగ్రత్తల గు రించి చర్చించనున్నారు. అలాగే కృష్ణా పుష్కర పనులను సమీక్షించి, తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది.

04/29/2016 - 06:02

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషనర్ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తడ మండలం బివి పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై విచారణ నిర్వహించాలని ఆదేశించింది.

04/29/2016 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ ఎంతో అవసరమని చెప్పారు.

Pages