S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2016 - 03:57

వరంగల్, ఏప్రిల్ 28: దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీకోసం ఎదురు చూస్తున్న కాజీపేటకు మొత్తంమీద ఏదో ఒక యూనిట్‌ను కేటాయంచేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. కోచ్ ఫ్యాక్టరీ స్థనంలో పిరియాడికల్ ఓవర్ హాలింగ్ (పిఓహెచ్) వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ ఆయమోదముద్ర వేసింది. 269 కోట్లతో ఈ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో (2016-17) రూ. 20కోట్లు కేటాయంచారు.

04/29/2016 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 28: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయకుండా నిర్మించిన భవన యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు జిహెచ్‌ఎంసి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకుడు గుంతలు కట్టని భవనాలకు మంచినీటి కనెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఎస్ వైదేహి రెడ్డి అనే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

04/29/2016 - 03:53

హైదరాబాద్, ఏప్రిల్ 28: మానవీయకోణంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక నూతన విధానాలను చేపట్టడానికి సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో అధికారులతో గురువారం మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

04/29/2016 - 03:48

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆమ్వేఇండియా సంస్ధ మనీ సర్క్యూలేషన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం ఆంధ్ర, తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఆమ్వే సంస్థ కార్యకలాపాలను రాష్ట్రంలో అరికట్టాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ ప్రతినిధి ఎంవి శ్యాంసుందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

04/29/2016 - 03:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు ముంపుప్రభావిత నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావువేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముంపునిర్వాసితును నూత న భూసేకరణ చట్ట పరిధిలోకి తీసుకురావాలంటూ ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

04/29/2016 - 03:06

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర విద్యుత్ సంస్థలకు బకాయి ఉన్న రూ. 2585 కోట్లను తెలంగాణ విద్యుత్ సంస్థలు తక్షణమే చెల్లించాలని, విద్యుత్ సౌధ విభజనకు ప్రత్యేక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు, డిస్కంల వద్ద ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఇంజనీర్లు గురువారం ధర్నా నిర్వహించారు.

04/29/2016 - 03:03

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఒకే పోస్టర్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు కాంగ్రెస్‌కు ఓటు వేయమని ప్రజలకు పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? చూసేందుకు వింతగా అనిపించినా ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరులో ఈ పోస్టర్ ఓ సంచలనం. భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పోస్టర్‌లానే తెలంగాణ రాజకీయాలు మారనున్నాయి.

04/29/2016 - 03:00

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికొక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.

04/29/2016 - 02:57

హైదరాబాద్, ఏప్రిల్ 28: దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయి రైల్ మంత్రి రాజభాష షీల్డ్ లభించింది. హిందీ యేతర భాషలు మాట్లాడే దక్షిణాది రాష్ట్రా ల్లో దేశ అధికార భాష హిందీని అమలు చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ షీల్డ్ లభించింది.

04/29/2016 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ టిఏస్ ఠాకూర్ కంటతడి పెట్టడం తనను కలచివేసిందని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయముర్తుల సంయుక్త సమావేశంలో తెలంగాణ తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Pages