S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2018 - 03:53

*విజయనగరం జమ్మాదేవిపేట గ్రామ దర్శినిలో సీఎం చంద్రబాబు పిలుపు * సంక్షేమ పథకాలపై ప్రజలతో ముఖాముఖి

06/05/2018 - 03:45

హైదరాబాద్, జూన్ 4: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లోని యుజి కోర్సులో చేరేందుకు నిర్వహించిన నీట్-యుజి ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో బీహార్‌కు చెందిన కల్పన కుమారి 691 మార్కులతో టాపర్‌గా నిలిచింది. జనరల్‌లో 119 మార్కులు, రిజర్వుడ్‌లో 96 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. తెలంగాణకు చెందిన రోమన్ పురోహిత్ 690 మార్కులతో రెండోస్థానంలో నిలిచాడు.

06/05/2018 - 04:03

ఏలూరు, జూన్ 4 : సొమ్ము ఒకరిది...సోకు మరొకరిది అన్నట్లుగా తెలుగు తమ్ముళ్ల వ్యవహారాలు మారిపోయాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడుకు చేరుకున్న జగన్‌ను కలుసుకున్న పలువురు డ్వాక్రా మహిళలు నిధుల దుర్వినియోగంపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

06/05/2018 - 01:40

విజయవాడ, జూన్ 4: కేంద్ర ప్రభుత్వంపైనా,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే వీలుండదనే ఉద్దేశంతోనే ప్రత్యేక ప్యాకేజీ కింద అందిస్తున్న సహాయాన్ని కూడా దురుద్దేశపూర్వకంగా కాలదన్నుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అవాకులు చవాకులు పేలుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావునిప్పులు చెరిగారు.

06/04/2018 - 04:10

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో అతి ప్రధానమైన, నిజాం పాలనలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు దేశ రైల్వేలోనే ప్రతిష్టాత్మకంగా మారింది. కొనే్నళ్ల కిందట రైల్వే స్టేషన్ లోపల, బయట ఉన్న పరిస్థితులు నూటికి నూరు శాతం ఇప్పుడు మారిపోయాయి.

06/04/2018 - 03:20

హైదరాబాద్, జూన్ 3: అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో పారాచూట్‌తో కూడిన ప్యారామోటారింగ్ ప్రారంభమైంది. నగరవాసులను అలరించేందుకు ఏర్పాటు చేసిన ప్యారమోటారింగ్‌ను డీజీపీ ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక శాఖ, అడ్వంచర్ స్పోర్ట్స్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్యారమోటారింగ్ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీజీపీ కోరారు.

06/04/2018 - 00:39

హైదరాబాద్, జూన్ 3: కేంద్రంతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లబ్దిచేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అంజన్‌కుమార్ యాదవ్ నగర అధ్యక్షుడిగా పదవీ బాధ్యత స్వీకార సభను ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించారు.

06/04/2018 - 00:36

హైదరాబాద్, జూన్ 3: రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసిన చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ కార్యక్రమం రాష్టవ్య్రాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈనెల 20లోగా తప్పులను సరిదిద్దాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెవిన్యూ సిబ్బంది పూర్తిగా దిద్దుబాటు చర్యల్లో నిమగ్నమైంది.

06/04/2018 - 00:48

కర్నూలు, జూన్ 3: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. నరేంద్ర మోదీకున్న ఆకర్షణ శక్తిని తగ్గించడం కోసం బాబు మరోఎత్తు వేసినట్లు సమాచారం.

06/04/2018 - 00:32

హైదరాబాద్, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమం లెక్కలకు, రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దాంతో సాగవుతున్న భూముల లెక్కలు తేల్చేందుకు సర్కారు సిద్ధమైంది. సాగుచేస్తున్న రైతులు, సాగుచేయని రైతులకు సంబంధించి పట్ట్భాములు 142 లక్షల ఎకరాలున్నట్టు భూప్రక్షాళన సందర్భంగా తేలింది.

Pages