S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2018 - 17:16

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాచారంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మసీదు వద్ద అపుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిపోయారు. ఆ పసిగుడ్డును ఎలుకలు చుట్టుముట్టి గాయపరచటంతో పెద్దగా రోదించసాగింది. స్థానికులు గమనించి 108కు ఫోన్‌చేసి ఆ పసికూనను నీలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.

06/05/2018 - 13:13

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పనసపొట్టు గ్రామంలో గిరిజనుల సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు.

06/05/2018 - 12:45

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం మూలమలుపు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో పెళ్లి కుమార్తెతో సహా 22 మందికి గాయాలు కాగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

06/05/2018 - 12:35

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసే విభాగంలో మంగళవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో డిగ్రీ పరీక్షల సమాధాన పత్రాలు కాలిపోయాయి. సంఘటనా స్థలాన్ని ఓయూ వీసీతో పాటు... ఏసీపీ, సీఐ పరిశీలించారు.

06/05/2018 - 03:00

న్యూఢిల్లీ, జూన్ 4: నీట్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ ఎంసిఐ విధించిన నిబంధనలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచి ఈ మేరకు కేంద్రం, సిబిఎస్‌ఇ, కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

06/05/2018 - 02:27

* 7నుంచి సన్నాహక ప్రక్రియ ప్రారంభం * ప్రకటించిన గుర్తింపు యూనియన్ టీఎంయూ

06/05/2018 - 03:58

హైదరాబాద్, జూన్ 4: తమ శాసనసభ్యత్వాలను రద్దు చేసినా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో టీపీసీసీ నాయకత్వం, సీఎల్పీ విఫలమయ్యాయని, నిర్లక్ష్యం చేశాయని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు చేసిన విమర్శలు పార్టీలో దుమారాన్ని రేపాయి. ఈ విషయాన్ని వారు ఢిల్లీ అధిష్టానం దృష్టికీ తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే.

06/05/2018 - 02:23

హైదరాబాద్, జూన్ 4: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. శాసనసభ్యత్వం రద్దును సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ 12మంది తెరాస ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేశారు.

06/05/2018 - 02:00

విశాఖపట్నం, జూన్ 4: నైరుతి రుతుపవనాలు సోమవారం రాయలసీమను తాకాయి. నిర్ణీత సమయం కన్నా, రెండు, మూడు రోజులు ముందే రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలియచేశారు. ఈ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయని, 7 నుంచి 9లోగా ఉత్తర కోస్తాలో ప్రవేశిస్తాయని తెలియచేశారు. రుతుపవనాల ప్రభావం వలన రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి.

06/05/2018 - 03:54

సిరిసిల్ల, జూన్ 4: పెట్రో ధరలను పైసల్లో తగ్గంచి కేంద్రం షాక్ ఇస్తుంటే, పీఎం రిలీఫ్ ఫండ్‌కు 9 పైసల చెక్కు ఇచ్చి కేంద్రానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. సోమవారం జరిగిన ప్రజావాణిలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌కు వి.చందు అనే యువకుడు 9పైసల చెక్కు ఇస్తూ పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందచేయాలని కోరడం సంచలనమైంది.

Pages