S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/24/2018 - 00:05

అవి సమ్మర్ వెకేషన్స్.. మెడికల్ కాలేజి గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజీకి, పాఠాలకి ‘బై’ చెప్పేసి సిమ్లా టూర్ ప్లాన్ చేశారు. మొట్టమొదటగా సిమ్లా.. ఆ తర్వాత ఎక్సెట్రా.. ఎక్సెట్రా...
ఇది దాదాపు పదిరోజుల షెడ్యూల్..

06/23/2018 - 21:08

మనం అక్వేరియం చూడాలంటే భూమిపై నిలబడే చూస్తాం. కాస్త పెద్దదైతే తలెత్తి చూస్తాం. కానీ బెర్లిన్‌లోని రాడిసన్ హోటల్‌లో ఉన్న అక్వేరియంను చూడాలంటే మాత్రం ఏకంగా లిఫ్ట్ ఎక్కాల్సిందే! ఎందుకంటే ఇదేమీ ఆషామాషీ అక్వేరియం కాదు. 82 అడుగుల పొడవున విస్తరించి ఉందీ అక్వేరియం. ఇలాంటి అక్వేరియాన్ని మామూలుగా ఎలా చూడగలం?

06/17/2018 - 00:46

చాలామంది వింటున్నట్టు కన్పిస్తారు. కానీ వారి మనస్సు ఎక్కడో విహారం చేస్తూ వుంటుంది. ఇది క్లాసురూంల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలామంది ఇలా కన్పిస్తూ వుంటారు. వినకపోవడం ఒక మాట అవుతే సరిగ్గా వినకపోవడం కూడా జరుగుతూ వుంటుంది. అసలు వినకపోవడం కన్నా సగం సగం వినడం వల్ల మరీ ప్రమాదం వుంది.

06/17/2018 - 00:10

చాలా కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి నా ఫోనుకు ఓ చిట్టి పొట్టి సందేశం వచ్చింది.. ఆ ఎస్.ఎం.ఎస్. లో ఇలా వుంది...
యోగ అభ్యసించండి. క్రమం తప్పకుండా పాటించండి. యోగ మన మనస్సు మీద, మన శరీరం మీద, మన భావోద్వేగాల మీద, మన శక్తి యుక్తుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. యోగాతో జీవితాన్ని కడకంటా సంపూర్తిగా ఆరోగ్యంగా అనుభవించండి
- ఆయూష్ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం

06/16/2018 - 22:28

2022 నాటికి మన దేశంలో అంతర్జాల వినిగదారుల సంఖ్య 500 మిలియన్‌ల పైబడుతుంది. అత్యధికంగా మొబైల్ ఫోన్‌లలో ఇంటర్నెట్ వినియోగం దూసుకుపోతోంది. మన దేశ జనాభాలో మహా నగరాలు, పట్టణాలు పల్లెల మధ్య డిజిటల్ విప్లవానికి సంబంధించి పెను అగాధం నెలకొని ఉంది.

06/16/2018 - 22:23

శతకీర్తికి మనసంతా చికాకుగా వుంది. కళ్ళు మూసినా.. తెరచినా.. కలతగానేవుంది. తానొకటి తలిస్తే.. తన అనుకునే తనవారంతా తలో మూలనుంచి తలోమాట అంటూ, తన దృఢ నిశ్చయాన్ని, నిర్మలత్వాన్ని తూట్లుతూట్లుగా తూలనాడుతూనే వున్నారు మనసంతా తీవ్ర అశాంతికి లోనవుతోంది. ఇంతకీ తను తీసుకున్న నిర్ణయం వారి సగటు మనస్తత్వాలకి నచ్చినట్లుగా లేదు. ఇంతలో పాప రిమోటుతో టీవీ స్విచాన్ చేసింది.

06/16/2018 - 22:06

ఒక సుల్తాన్ తన సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి ఒక సుప్రసిద్ధుడయిన దర్వీష్ దగ్గరకు వచ్చి ‘నేను నా ఐశ్వర్యాన్ని, విశాల సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను. సత్యానే్వషణే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడుగా చేర్చుకోండి’ అన్నాడు.

06/16/2018 - 21:31

మనిషి ఆరోగ్యంపై వాయుకాలుష్యం చూపే ప్రభావం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. వాయు కాలుష్యంవల్ల వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు, గుండెపోటు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధుల గురించి చాలా పరిశోధనలు జరిగాయి కూడా. కానీ వాయుకాలుష్యం ఆలోచనలు, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుందని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.

06/10/2018 - 00:58

‘కానీ..’
అన్న పదం ఎలా పుట్టిందో తెలియదు. దానికి ఎక్కువ విలువని ఇస్తాం. ఈ వాక్యం చెప్పే సందర్భంలో కానీ అవసరమే కానీ చాలా సందర్భాల్లో అది అనవసరం.
ఈ పదంతోనే చాలామంది జీవితాలు ముగుస్తాయి.
నిరాశా, నిస్పృహలకి లోను కావడానికి ఈ పదమే ఎక్కువ దోహదం చేస్తుంది.
చాలామంది ఎన్నో పనులని చేద్దామని అనుకుంటారు.
కానీ.. దగ్గర ఆగిపోతారు.
ఉదయానే్న లేద్దామని అనుకుంటారు. కానీ...

06/10/2018 - 00:18

గరుత్మంతుడు చిన్నప్పుడు తల్లి, దాస్యవిముక్తి కోసం, సవతి తల్లి కోరిక మేరకు అమరపురానికి వెళ్లి అమృతం తెచ్చి యివ్వడం.. ఆ తరువాత శ్రీహరికి వాహనం కావడం.. లోకపాలకుడు శ్రీహరికే వాహనం అయిన తను గర్విష్టిగా మారడం.. గమనించిన శ్రీహరి ఆ గర్వాన్ని అణచి కళ్ళు తెరిపించడం.. సుశాంత్ చిన్నప్పుడు పాఠ్యాంశంగా తెలుగులో ఉండేది. ఏదో పాఠంగా చదువుకున్నాడు కానీ ఒంట పట్టించుకోలేదు. అదే ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది.

Pages