S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/07/2016 - 17:22

విశాఖ : విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్ నాథ్ బుధవారం అన్నారు. విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం తాను గతంలో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు.

09/07/2016 - 16:56

హైదరాబాద్‌ : ప్రత్యేక హోదాను ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తున్నందున హోదా తప్ప ప్రజలు దేనిని ఒప్పుకోరని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడితూ, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో హైడ్రామా నడుస్తోందని, హోదాపై ఢిల్లీలో కకార భాష మొదలైందని ఎద్దేవా చేశారు. ఇదొక పెద్ద హైడ్రామా అని.. ఉన్నత స్థాయి నుంచే ఢిల్లీలో హైడ్రామా నడిపిస్తున్నారని అన్నారు.

09/07/2016 - 15:03

విజయవాడ: ఔట్ సోర్సింగ్ పద్ధతిని నిలిపివేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని ఎన్జీవో నేతలు కోరారు. ఆర్థిక మంత్రి యనమలతో ఎన్జీవో నేతలు అశోక్‌బాబు, విద్యాసాగర్, వెంకటేశ్వరరావు బుధవారం ఇక్కడ భేటీ అయ్యారు.

09/07/2016 - 14:20

విజయవాడ: ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం కసరత్తు చేస్తున్నా, కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న చర్చల్లో మాత్రం ప్రతిష్ఠంభన నెలకొంది. సిఎం చంద్రబాబు సమక్షంలో ప్యాకేజీని కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటించేలా సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

09/07/2016 - 13:58

గుంటూరు: తునిలో జరిగిన కాపు ఐక్యగర్జనతో తనకెలాంటి సంబంధం లేదని, అక్కడి విధ్వంస ఘటనల్లో తాను పాలుపంచుకోలేదని వైకాపా నేత భూమన కరణాకర్‌రెడ్డి సీఐడీ అధికారుల ఎదుట రెండోరోజు విచారణలో బుధవారం తేల్చి చెప్పారు. తునిలో కాపు గర్జన అనంతరం జరిగిన రైలు, పోలీస్‌స్టేషన్ల దహనం, ఆస్తుల విధ్వంసం కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం భూమన కరణాకర్‌రెడ్డి సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

09/07/2016 - 13:27

విజయవాడ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుండగా, కొన్ని డిమాండ్లను అంగీకరిస్తేనే తాను దిల్లీ వస్తానని సిఎం చంద్రబాబు షరతులు విధిస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి దిల్లీ రావాల్సిందిగా కోరారని సమాచారం.

09/07/2016 - 13:27

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం కసరత్తు చేస్తుండడంతో ఆ వివరాలపై సిఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై ప్యాకేజీ గురించి చర్చిస్తున్నారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పుల్లారావులతో భేటీ అయ్యారు.

09/07/2016 - 13:26

గుంటూరు: తనపై తప్పుడు కేసులు పెట్టించి సిఎం చంద్రబాబు వేధింపులకు దిగారని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి బుధవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. తుని విధ్వంసం కేసులో సిఐడి విచారణకు వరుసగా రెండోరోజు బుధవారం ఆయన హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

09/07/2016 - 13:26

విశాఖ: ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షల మేరకు విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి బుధవారం విలేఖరులతో అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల మనోభావాలను గౌరవించాలన్నారు. ఎపి నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఈ విషయంలో ఎంపీలంతా కలిసి ఒప్పిస్తామని, సిఎం చంద్రబాబు కూడా గట్టిగా ఒత్తిడి తేవాలన్నారు.

09/07/2016 - 13:25

విశాఖ: కేంద్ర ప్రభుత్వం ఎపికి ప్రకటించబోయే ప్రత్యేక ప్యాకేజీలో విశాఖకు బదులు విజయవాడకు రైల్వేజోన్ కేటాయిస్తారన్న వార్తలు రావడంతో బుధవారం ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమైంది. జివిఎంసి కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకారులు నిరసన ప్రారంభించారు.

Pages