S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/18/2016 - 06:32

కేంద్ర మంత్రి సుజనా చౌదరి

03/18/2016 - 06:31

తడ, మార్చి 17: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను గురువారం బెల్జియం వాణిజ్య దూత డాక్టర్ భర్త్ డి గూఫ్ పర్యటించారు. ఈయనను ఎండి రవీంద్రా సన్నారెడ్డి ఘన స్వాగతం పలికి శ్రీసిటీలో ఏర్పాటైన వివిధ పారిశ్రామిక వసతుల గురించి సాధించిన ప్రగతిని వివరించారు.

03/18/2016 - 08:33

విమానాల వ్యాపారానికి భారత్ ఎంతో అనువైంది : పలు సంస్థల ఉద్ఘాటన

03/18/2016 - 06:30

న్యూఢిల్లీ, మార్చి 17: పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ సవరణ బిల్లులో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటుపై పరిమితి విధించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించడం కష్టసాధ్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

03/17/2016 - 07:48

న్యూఢిల్లీ: సైబీరియాలోని రష్యా చమురు క్షేత్రాల్లో భారతీయ చమురు సంస్థలు 4.2 బిలియన్ డాలర్ల (28,253 కోట్ల రూపాయలకుపైగా)తో వాటాలు కొనుగోలు చేస్తున్నాయి.

03/17/2016 - 07:45

హైదరాబాద్: ఔత్సాహిక పారిశ్రామిక రంగం, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు వీలుగా పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేసినట్లు రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

03/17/2016 - 07:43

న్యూఢిల్లీ: భారత కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపిలో 0.7 శాతానికి పరిమితం కావచ్చని జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నొమురా బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఇది 1.3 శాతంగా నమోదైంది. దేశీయ ఎగుమతులు వరుసగా 15 నెలల నుంచి క్షీణిస్తుండగా, గత నెల ఫిబ్రవరిలోనూ గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 5.66 శాతం పడిపోయి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

03/16/2016 - 06:58

న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు వరుసగా 15వ నెలా క్షీణించాయి. గత నెల ఫిబ్రవరిలో 5.66 శాతం పడిపోయి 20.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగుమతులు కోలుకోలేకపోయాయి.

03/16/2016 - 06:56

న్యూఢిల్లీ: దిగివచ్చిన ద్రవ్యోల్బణం గణాంకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యం 3.5 శాతంగా నిర్ణయించడం మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించవచ్చని సిటి గ్రూప్ అంచనా వేసింది.

03/16/2016 - 06:55

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ఆదర్శంగా, ఉత్తమ నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమకు తోడ్పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెజాన్‌ను కోరారు. మంగళవారం అసెంబ్లీ ఛాంబర్‌లో తనను కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసు బృందంతో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కారాల్లో మిగిలిన రాష్ట్రాలకు ఎపి మార్గదర్శనం చేసేలా సహకారం అందించాలని బృందంతో అన్నారు.

Pages