S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/16/2018 - 04:18

హైదరాబాద్: భారత్‌తో ఇరాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రోహనీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన రోహనీ తొలుత హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన న్యూఢిల్లీకి వెళ్తారు. శనివారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో, రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌తో భేటీ అవుతారు.

02/15/2018 - 16:12

అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఆయన గురువారంనాడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ దీనిపై ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై చర్చించారు.

02/15/2018 - 16:04

ఏలూరు: ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల్లో 90శాతం అమలుచేశామని, తెలుగుదేశం మాత్రం పది శాతం మాత్రమే అమలుచేసిందని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదాపై ఒకరు డ్రామాలు ఆడుతుంటే.. మరొకరు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

02/15/2018 - 16:03

హైదరాబాద్: తాను ఏర్పాటుచేయదలచిన జేఫ్సీకి మద్దతు ఇవ్వాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కోరారు. ఈ మేరకు పవన్ ఫోన్ చేసి రేపు తన కార్యాలయంలో ఏర్పాటుచేయదలచిన సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ ఆహ్వానాన్ని రఘువీరారెడ్డి సున్నితంగా తిరస్కరించి, పార్టీ తరపున మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌లు హాజరవుతారని వెల్లడించారు.

02/15/2018 - 12:20

తిరుపతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఒకరు కోడూరు సుబ్బయ్య గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందారు. కాగా... కోడూరు సుబ్బయ్య కొడుకు బాలసుబ్రమణ్యం ప్రస్తుతం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

02/15/2018 - 12:16

హైదరాబాద్: ఉప్పల్ చిలకానగర్ నరబలి కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందింది. భవనంపై లభించిన తల, ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడశిశువుగా నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు.

02/15/2018 - 14:00

హైదరాబాద్:ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇంటర్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి 9.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4.75 లక్షల మంది ఫస్టియర్, 4.50 లక్షల మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

02/15/2018 - 12:00

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శానానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3 కోట్లుగా ఉంది.

02/15/2018 - 11:58

కడప : దశాబ్దాల కాలంగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్ కుమార్ అగర్వాల్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో గత కొన్నేళ్లుగా పోలీసుల కన్నుకప్పి కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడు.

02/15/2018 - 06:40

హైదరాబాద్, ఫిబ్రవరి 14: వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కింద నష్టపరిహారం నిమిత్తం రూ.458 కోట్లను కేటాయించి అర్హులైన వారికి చెల్లించని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. ఆంధ్ర ప్రభుత్వం భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు కేసులకు సంబంధించి ప్రస్తావించిన అంకెలపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది.

Pages