S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/25/2018 - 01:39

హైదరాబాద్, ఆగస్టు 24: ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి. అవీ ఎప్పుడొస్తాయనేది నాకు కూడా తెలియదు. ఆ విషయాన్ని నాకు వదిలేయండి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. ప్రగతి నివేదన సభలోనే ఎన్నికల భేరీని మోగిద్దాం’ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

08/25/2018 - 01:17

విజయవాడ, ఆగస్టు 24: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ జన జాగృతి పార్టీ ఆవిర్భవించింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఈ పార్టీని విజయవాడలో శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా లోగోను కూడా ఆవిష్కరించిన గీత తమ పార్టీ గుర్తుగా గొడుగును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో రాజకీయాలు రెండు పార్టీలు, రెండు కులాలకే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు.

08/25/2018 - 01:11

విజయవాడ, ఆగస్టు 24: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చివరి విడతగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగునున్నదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రధానంగా గడిచిన నాలుగేళ్ల కాలంలో తమకు మంత్రివర్గంలో స్థానం లేకపోవటంపై అటు ముస్లింలు, మైనార్టీలు ఇటు గిరిజనులు అసంతృప్తితో ఉన్నారు.

08/25/2018 - 01:09

యలమంచిలి, ఆగస్టు 24:తమ పార్టీ అధికారంలోకి వస్తే మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని వైకాపా అధినేత జగన్ ప్రకటించారు. యలమంచిలిలో శుక్రవారం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. రైతన్నలు ఆశించే రాజన్న పాలన తమతోనే సిద్ధిస్తుందన్నారు.

08/25/2018 - 04:33

తిరుపతి, ఆగస్టు 24: సిరుల తల్లి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీ వత్రాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువ జామునే అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.

08/25/2018 - 04:46

అమరావతి: విశాఖపట్నంలో సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పర్యాటకానికి ఆతిథ్యం అతిముఖ్యమని స్పష్టం చేసిన ఆయన అతిథుల అభిమానం పొందటం వల్లే పర్యాటక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పర్యాటకుల రాక ఆయా విభాగాల తీరుపై ఆధారపడి ఉందని ఉద్ఘాటించారు.

08/24/2018 - 04:51

హైదరాబాద్: గత కొన్ని నెలలుగా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు గురువవారం నాడు మరోసారి కంటి ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సెంటర్ ఫర్ సైట్ కంటి ఆస్పత్రిలో పవన్‌కళ్యాణ్‌కు కంటికి డాక్టర్ సంతోష్ జి హౌనావర్ ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ జీవీఎస్ ప్రసాద్ సహకారం అందించారు.

08/24/2018 - 03:14

బళ్ళారి, ఆగస్టు 23: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద తగ్గింది. దీంతో జలాశయం 12 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువ నదిలోకి 75,858 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా గురువారం 1631.17 అడుగులుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 65,948 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 75,858 క్యూసెక్‌లు.

08/24/2018 - 03:13

హైదరాబాద్, ఆగస్టు 23: వెలాన్‌కన్నీ పండుగను పురస్కరించుకొని ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడులో అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే ఈ పండుగకు దేశవ్యాప్తంగా ఉన్న వారు హాజరు అవుతుంటారు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-వెలాన్‌కన్నీ (ట్రైన్ నెంబర్ 07059-07060) రెండు రైళ్లు నడపనున్నారు.

08/24/2018 - 02:09

తిరుపతి, ఆగస్టు 23: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి నిర్వహించే ఆర్జిత సేవా టికెట్లలో జరుగుతున్న కుంభకోణం తాజాగా మరోమారు బయటపడింది. టీసీఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాసులు వేల ఆర్జితసేవా టికెట్లు నకిలీ ఓటరు కార్డులతో అక్రమంగా పొందుతున్న వైఖరిని టీటీడీ విజిలెన్స్ విభాగం గుట్టు రట్టు చేసింది.

Pages