S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/24/2018 - 01:57

విజయవాడ, ఆగస్టు 23: పర్యావరణ సమతుల్యత పాటించేలా భవన నిర్మాణాలను చేపట్టాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్ట్‌లదేనని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. భావితరాలకు మార్గదర్శిగా నిలిచే మన రాజధాని అమరావతి నిర్మాణంలో యువ ఆర్కిటెక్ట్‌లు తమ ప్రతిభను చూపించి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. విజయవాడలో 10 ఎకరాల స్థలంలో రూ.

08/24/2018 - 01:52

తిరుపతి, ఆగస్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిసాయి. తొలి రెండురోజుల్లాగానే గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. పంచామృతాలతో అభిషేకించి చివరిగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.

08/24/2018 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 23: దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి ప్రవేశపరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ స్పష్టత ఇవ్వడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ముందు పరీక్ష నిర్వహణ వరకూ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ బాధ్యతలు తీసుకోగా, మెడికల్ కాలేజీల కౌనె్సలింగ్ బోర్డు అడ్మిషన్ల బాధ్యతను నెరవేర్చనుంది.

08/24/2018 - 01:23

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా సీఎం చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి ఆశించిన మేరకు స్పందన రావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు.

08/24/2018 - 01:21

హైదరాబాద్, ఆగస్టు 23: ‘అవునంటే కాదనిలే...కాదంటే అవుననిలే’ అన్నది టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గా సరిపోతాయని అంటారు. సీఎం మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయని అయన్ను బాగా ఎరిగిన వారికి తెలుసు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని బుధవారం మంత్రులతో జరిగిన భేటీలో సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్, తెల్లారేసరికి ఇందుకు భిన్నంగా వ్యవహరించారన్న చర్చ జోరందుకుంది.

08/24/2018 - 01:16

హైదరాబాద్, ఆగస్టు 23: రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రేషన్ డీలర్ల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కమీషన్ పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమోదించడంతో ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి.

08/24/2018 - 01:10

హైదరాబాద్, ఆగస్టు 23: జీవచక్రాన్ని నిలిపివేయవచ్చా.... అంటే మనిషి యవ్వనాన్ని చివరి వరకూ కొనసాగించవచ్చా? ఇది అసాధ్యంగా కనిపించినా, శాస్తవ్రేత్తలు మాత్రం సాధ్యమే అంటున్నారు. అయితే ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. వయస్సు మీద పడకుండా ఆపగలిగే పరిస్థితులు మున్ముందు ఉంటాయని వారు విశ్వసిస్తున్నారు.

08/24/2018 - 04:21

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? తాజా పరిణామాలు ఈ అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోయినా, జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ సంకేతాలనే ఇస్తున్నాయ.

08/24/2018 - 00:53

యలమంచిలి, ఆగస్టు 23: తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని వైకాపా అధినేత జగన్ హామీ ఇచ్చారు. రైతాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పంటలు పండిస్తోందని అయినా కష్టాల నుంచి గట్టెక్కడం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి పట్టం కడితే అన్నదాతను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

08/24/2018 - 00:46

విజయవాడ, ఆగస్టు 23: భారతదేశ రెండో అత్యున్నత రాజ్యంగపరమైన ఉప రాష్టప్రతి పదవి, రాజ్యసభ చైర్మన్ పదవిల ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తానని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలన్నారు.

Pages