S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/23/2018 - 05:37

కర్నూలు, ఆగస్టు 22: శ్రీశైలం జలాశయానికి మరోమారు వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు క్రష్ట్‌గేట్లను బుధవారం మళ్లీ తెరిచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద నీటి చేరిక తగ్గుముఖం పట్టడంతో మంగళవారం మ ధ్యాహ్నం అ న్ని గేట్లను మూసివేసి కేవలం విద్యుత్ ఉత్పత్తి అనంతరం సాగర్‌కు నీరు విడుదల చేశారు.

08/23/2018 - 05:00

తిరుపతి, ఆగస్టు 22: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.

08/23/2018 - 04:35

హైదరాబాద్, ఆగస్టు 22: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి చితాభస్మాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదుల్లో నిమజ్జనం చేసే కార్యక్రమంలో భాగంగా అస్థికల కలశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ హైదరాబాద్ తీసుకువచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతల కడపడి సందర్శనార్ధం అస్థికల కలశాన్ని ఉంచుతారు. 23వ తేదీన ఉదయం రెండు దిశల్లో అస్థికల నిమజ్జన యాత్ర జరుగుతుంది.

08/23/2018 - 05:07

* వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే
* మధురపూడి విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష

08/23/2018 - 02:49

* 25న కర్నూలులో ధర్మపోరాటం * 28న గుంటూరులో ‘నారా హమారా’ మైనారిటీల సదస్సు
* పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

08/23/2018 - 05:08

మంగళగిరి, ఆగస్టు 22: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ సమీపంలో కృష్ణానదిలో మునిగిపోయి బుధవారం నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చిర్రావూరు గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఒక ఆటోలో కృష్ణానది ప్రవాహాన్ని చూడటానికి గుండిమెడ ఇసుకరీచ్ వద్దకు వెళ్లారు. వీరిలో ఐదుగురు నదిలోకి దిగారు.

08/23/2018 - 05:10

* ముందస్తు ఎన్నికలపై కూడా చర్చ
* గడువు ప్రకారమే వెళ్లాలని మంత్రుల సూచన

08/23/2018 - 05:15

హైదరాబాద్, ఆగస్టు 22: సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుప్రకటించారు. గత ఏడాది 25 శాతం ఇవ్వగా ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం ఇవ్వాల్సిందిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్‌ను సీఎం ఆదేశించారు.

08/23/2018 - 02:27

ఏలూరు, ఆగస్టు 22: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువు అడ్డదారి తొక్కాడు. తన దగ్గర చదువుకు వచ్చిన విద్యార్థినిని మాయమాటలతో లోబరచుకుని, ఆమెను గర్భవతిని చేసి, రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నాడు. ఈ ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా తీవ్రంగా కొట్టారు.

08/23/2018 - 02:24

హైదరాబాద్, ఆగస్టు 22: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాలుగేళ్ళ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ‘ప్రగతి నివేదన’ సభ పెడితే, ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అయ్యాయో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఏ. రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Pages