S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/31/2018 - 03:17

హైదరాబాద్, మార్చి 30: న్యాయవ్యవస్థకు కాయకల్పచికిత్స చేయాల్సిన తరుణం ఆసన్నమైందని పలువురు న్యాయకోవిదులు, రాజ్యంగ నిపుణులు, న్యాయమూర్తులు పేర్కొన్నారు. వ్యవస్థపై దేశ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలంటే ప్రక్షాళన ఒక్కటే మార్గమని పలువురు న్యాయకోవిదులు, రాజ్యంగ నిపుణులు, న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

03/31/2018 - 02:34

ఒంటిమిట్ట, మార్చి 30: కడప జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అరగంట పాటు ఉధృతంగా వీచిన పెనుగాలలు, వడగండ్ల వానకు కోదండరాముడి ఆలయం పరిసరాలు, కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన రేకులషెడ్లు ఎగిరిపడ్డాయి. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, టెంట్లు ఎగిరిపడ్డాయి. ఈ బీభత్సకాండలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మందివరకు గాయపడ్డారు.

03/31/2018 - 02:08

విశాఖపట్నం, మార్చి 30: ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి అవుతున్న బెల్లంతో అనకాపల్లి బెల్లం వాణిజ్యం కుదేలవుతోంది. ఉత్పత్తి వ్యయం కూడా దక్కించుకోలేని చెరకు రైతులు, బెల్లం వ్యాపారులు దిగాలుపడ్డారు. ఒడిశా, పశ్చిమ బంగ, జార్ఖ్‌ండ్ రాష్ట్రాలకు అనకాపల్లి నుంచి పెద్ద ఎత్తున బెల్లం ఎగుమతి అవుతుంటుంది. గతేడాది సీజన్‌లో అనకాపల్లి మార్కెట్‌లో 19 వేల టన్నుల బెల్లం వ్యాపారం జరిగింది.

03/31/2018 - 02:35

విజయవాడ, మార్చి 30: ప్రపంచంలోని 5 అత్యుత్తమ సంతోష నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. గ్రీన్, బ్లూ సిటీగా నిర్మించనున్న అమరావతి ఆంధ్రుల అత్యున్నత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రజల సంతోష సూచీలో అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెడతామని తెలిపారు.

03/30/2018 - 15:43

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని, కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధించడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి తులసిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్లో పీసీసీ కార్యదర్శి గౌతమ్‌తో కలిసి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

03/30/2018 - 12:36

కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాఘవేంద్రనగర్‌లో భార్య జయదేవి అలియాస్ దేవిని ఆమె భర్త శ్రీనివాస్ గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

03/30/2018 - 12:26

జనగామ: జిల్లాలోని సిద్దేంకి గ్రామంలో రావుల నర్సిరెడ్డి, లక్ష్మీ అనే దంపతులు గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా... వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

03/30/2018 - 12:22

ప్రొద్దుటూరు: చిత్తూరు జిల్లా ప్రొద్దుటూరులో బ్యాంక్ సొమ్ముతో ఓ ఉద్యోగి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..ప్రొద్దుటూరుకు చెందిన గురుమోహన్ రెడ్డి రంగసముద్రం ఎస్‌బిఐలో క్యాషయర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా రాకపోవటంతో మేనేజర్‌కు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి పరిశీలించగా..

03/30/2018 - 12:22

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్ర నీటిపారుదుల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్లారు. వీరు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం విదితమే.

03/30/2018 - 04:48

హైదరాబాద్, మార్చి 29: మావవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించగలిగేది సైన్స్ మాత్రమేనని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్టప్రతి ప్రసంగించారు.

Pages