S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/25/2018 - 02:32

కాకినాడ, మార్చి 24: పెట్రోలియం అండ్ కెమికల్ పెట్రో ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) అడ్రస్ దాదాపుగా గల్లంతయ్యింది. విశాఖ-కాకినాడ మధ్య పీసీపీఐఆర్ ఏర్పాటవుతుందని ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన పారిశ్రామిక వర్గాల ఆశలన్నీ ఆవిరయ్యాయి. పీసీపీఐఆర్ పరిస్థితీవిధంగా ఉంటే కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్) పరిస్థితీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యింది.

03/25/2018 - 01:48

రంపచోడవరం, మార్చి 24: ఒడిసా రాష్ట్రానికి చెందిన మావోయిస్టు మిలీషియా కమాండర్, ఇద్దరు మిలీషియా సభ్యులు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ అజిత ముందు శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మిలీషియా కమాండర్ మడికి నగేష్ 2010లో మిలీషియా సభ్యునిగా చేరి, కమాండర్‌గా ఎదిగాడన్నారు.

03/25/2018 - 01:46

హైదరాబాద్, మార్చి 24: పాఠశాల స్థాయిలో విద్యార్థులు తెలుగు భాషను తప్పని సరిగా చదవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లు శనివారం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హఠాత్తుగా బిల్లును శాసనభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం అసెంబ్లీకి సమర్పించిన అజండాలో బిల్లు ప్రస్తావన లేదు.

03/25/2018 - 04:18

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) ఆధునాతన డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకుని మరిన్ని సేవలను ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులేస్తోంది. ఈమేరకు కొన్ని ప్రతిపాదనలను ఈ ఏడాది సిద్ధంచేసి అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు కొనుగోలుకు నగదు చెల్లిస్తున్నారు.

03/25/2018 - 01:38

హైదరాబాద్, మార్చి 24: విద్యుత్ చార్జీలు పెంచే యోచన లేదని, తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రం కాదని, 2024 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించేందుకు విద్యుత్ ప్రణాళికను ఖరారు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇంతవరకు 48వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు రూ.20500కోట్లను ఖర్చుచేశామని ఆయన స్పష్టం చేశారు.

03/25/2018 - 04:17

విశాఖపట్నం/ విజయవాడ: తీరప్రాంతం వినా రాష్టవ్య్రాప్తంగా మైదాన ప్రాంతాల్లో మెల్ల మెల్లగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ప్రభావంతోపాటు తీరాన్ని ఆనుకుని ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగానే పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కన్పిస్తోందని విశాఖ వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం తెలిపింది.

03/25/2018 - 04:15

విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ లక్షా 7వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలోనే వివిధ దేశాల రాజధానులను తలదనే్నలా అద్భుత రాజధాని నగర నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేసి తీరుతామంటూ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

03/25/2018 - 04:16

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వామపక్షాలతో కలిసి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు.

03/25/2018 - 04:17

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వచ్చే నెల 4న ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. తొలి విడతగా గత వారం కోల్‌కతాకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.

03/25/2018 - 01:36

సిగ్గుల మొగ్గలా సీతమ్మ.. పెళ్లి కళతో రామయ్య మెరిసిపోతుంటే.. వీరిద్దరి జగత్కల్యాణానికి భద్రగిరి సర్వాంగ
సుందరంగా ముస్తాబైంది. 26న జరిగే స్వామివారి కల్యాణానికి మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా సాగిన ధ్వజారోహణ దృశ్యం.

Pages