S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/26/2018 - 01:16

ఒంటిమిట్ట, మార్చి 25: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయం లో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆదివారం ధ్వజారోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత యాగశాల లో అంకురార్పణ పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభాన్ని శుద్ధి చేశారు. కంకణధారణ అనంతరం గరుత్మంతుని చి త్రం ఉన్న ధ్వజపటానికి శాస్త్రోకంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎగురవేశారు.

03/26/2018 - 01:13

భద్రాచలం టౌన్, మార్చి 25: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శ్రీరామనవమి, పట్ట్భాషేకం వేడుకగా నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఆలయంలో ప్రత్యేక పూజ లు జరగనున్నాయి. శ్రీరామనవమి నాడు ఉదయం 2గంటలకు ఆలయ తలుపులు తీసి 2.30 వరకు సుప్రభాత సేవ చేస్తారు. 2.30 గంటల నుంచి 4.30 వరకు తిరువారాధన, నివేద న కార్యక్రమం వల్ల దర్శనం ఉండదు. 4 గంటల నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషే కం.

03/26/2018 - 03:33

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు అధికార పార్టీ, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలనే వివక్ష లేకుండా అందరి పట్ల సమదృష్టితో వ్యవహరించి సంక్షేమ పథకాలను సమానంగా అన్ని నియోజకవర్గాలకు కేటాయిస్తారని, విశాలమైన మనస్సు ఉన్న గొప్ప నేత అని శాసనసభ వ్యవహారాలు, భారీసాగునీటి వ్యవహారాల శాఖమంత్రి టి హరీష్ రావు ప్రకటించారు. ఆదివారం ఇక్కడ శాసనసభ వివిధ శాఖలకు చెందిన ఆర పద్దులను ఆమోదించింది.

03/26/2018 - 00:59

నిజామాబాద్, మార్చి 25: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి సమీపంలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. 19మంది ప్రయాణికులతో కిక్కిరిసివున్న ఆటో, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

03/26/2018 - 00:57

ఖమ్మం, మార్చి 25: లోక కల్యాణ కారకుడు జగదభిరామునికి కల్యాణ శోభ వచ్చింది. దీంతో భద్రాచలం రంగుల దీపాలు, తాటాకు పందిళ్లతో కళకళలాడుతోంది. భద్రాద్రిలో ఆదివారం రాత్రి ఎదుర్కోలుతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి మిథిలా నగరాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు. తలంబ్రాలు, లడ్డూలను సిద్ధం చేశారు.

03/26/2018 - 03:32

భీమవరం: రాష్ట్రంలోని పలు మేజర్ పంచాయతీలు రానున్న కాలంలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. ఇందుకు రాష్ట్ర కేబినెట్ సబ్-కమిటీ కూడా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదమే తరువాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 14 కార్పొరేషన్లు, 96 మున్సిపాల్టీలు, నగరపంచాయతీలు వెరసి 110 ఉన్నాయి. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో 150 నగరపంచాయతీలు ఏర్పడతాయి.

03/26/2018 - 00:50

అమరావతి, మార్చి 25: నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశాక విధిలేని పరిస్థితుల్లోనే పోరాట మార్గం పట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానమిచ్చానని, లేఖలో అన్నీ అబద్ధాలేతప్ప ఒక్కటీ నిజం లేదన్నారు. బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమని, అలాంటిది నాలుగేళ్లు అయినా అది నెరవేరలేదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా హోదా అడగడం బీజేపీకి నచ్చడం లేదన్నారు.

03/25/2018 - 04:21

భద్రాచలం టౌన్: నవమి సుముహూర్తం అభిజిత్ లగ్నం.. ఈ లగ్నంలో సిగ్గుల మొగ్గగా సీతమ్మ.. పెళ్లి కళతో రామయ్య మెరిసిపోతుండగా.. వీరిద్దరి జగత్ కల్యాణానికి భద్రగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 26న జరిగే స్వామివారి కల్యాణం కోసం భద్రాచలం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శ్రీ రామనవమిని పురస్కరించుకుని దక్షిణ అయోధ్యగా వినుతికెక్కిన భద్రాద్రికి భక్తుల రాక ముందే ప్రారంభమైంది.

03/25/2018 - 02:40

రాజమహేంద్రవరం, మార్చి 24: పోలవరం కాంక్రీటు పనులు ఊపందుకున్నాయి.. వరద వచ్చేలోపు చేయాల్సిన కాంక్రీటు పనులను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తిచేయడానికి చర్యలు చేపట్టారు. రోజుకు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాలని నిర్దేశించారు.

03/25/2018 - 02:33

హైదరాబాద్, మార్చి 24: ఈ నెల 26న శ్రీరామనవమిని పురస్కరించుకుని టిఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ గమ్యస్థానాల నుంచి భద్రాచలంకు 225 ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి 30, ఖమ్మం నుంచి 45, పర్ణశాల నుంచి 44, కొత్తగూడెం నుంచి 30, మధిర నుంచి 5, మణుగూరు నుంచి 10 నడుపుతుండగా, 26న తిరుగు ప్రయాణంలో మరికొన్ని సర్వీసులు నడుపుతోంది.

Pages