S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ

08/19/2017 - 23:33

మొదట్లో తన మీద నెల్డా ప్రాక్టికల్ జోక్ వేస్తోందని ఆమె భర్త హగ్ అనుకున్నాడు. అయితే ఆమె ఎన్నడూ తన మీద ఎలాంటి ప్రాక్టికల్ జోక్ వేయలేదని అతనికి తెలుసు. ఆమె ఆ తరహా మనిషి కాదు. అంతేకాక ఆమెలో సెన్సాఫ్ హ్యూమర్ ఎంత తక్కువ అంటే, హగ్ ఏదైనా జోక్ చెప్పాక దాన్ని వివరిస్తే కాని అర్థమై నవ్వేది కాదు. అది జోక్ కాదని హగ్‌కి అర్థమయ్యాక తన భార్యతో చెప్పాడు.
‘ఈ పిచ్చి మంచిది కాదు. మాను’

08/12/2017 - 21:49

రాయ్ అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్థులో ఉంది. ఏడాదికి అద్దె ముప్పై రెండువేల డాలర్లు. కిటికీలోంచి కింద ఆకుపచ్చటి పార్క్, నగరం కనిపిస్తూంటాయి.
‘నా పేరు మీరు ఎవర్నించి తెలుసుకున్నారో దయచేసి చెప్తారా?’ రాయ్ తన దగ్గరికి వచ్చిన సందర్శకురాలిని ప్రశ్నించాడు.
‘నా పేరు జీన్’ చెప్పి ఆమె తన హేండ్‌బేగ్‌లోంచి ఓ కార్డ్ తీసి అతని ఎదురుగా బల్ల మీద ఉంచింది.

08/06/2017 - 22:54

ఆ లోయలోంచి హైవేని నిర్మించడానికి రెండేళ్లు పట్టింది. నిర్మాణంలో ఏటా ఒకరు మరణించారు. మొదటి సంవత్సరం రోడ్డు నిర్మాణ కూలీ మీద బరువైన క్రేన్ పడి మరణించాడు. తర్వాతి సంవత్సరం గత ఏభై ఏళ్లుగా తను ఉన్న ఇంట్లోంచి బయటకి వెళ్లడానికి దాని యజమాని నిరాకరించాడు. ఆ ఇంటి మీదుగా రోడ్డు వెళ్లాల్సి ఉండటంతో నిర్మాణం ఆగిపోయింది. తనని ఖాళీ చేయించడానికి వచ్చిన పోలీసుల మీద అతను కిటికీలోంచి రైఫిల్‌ని పేల్చాడు.

07/30/2017 - 00:10

నేను పేరిస్‌కి సాహసం కోసం రాలేదు. ఒకప్పుడు నేను పేరిస్‌లో క్రైలాన్ లేదా రిడ్జ్ హోటల్స్‌లో బస చేసేవాడిని. కాని ఇప్పుడు నా బస మారింది. ఫ్రెంచ్ వాళ్లు చక్కటి కాఫీని చేయలేరు. ఫోన్లో సరిగ్గా మాట్లాడలేరు. ఐతే నాకు ఈ రెంటి అవసరం లేదు. ఏప్రిల్లో కూడా పేరిస్ చల్లగానే ఉంది. నేను రూ డి రివోలి వైపు ఆ సాయంత్రం నడిచాను.

07/22/2017 - 21:33

టామ్ తన భార్య హెస్టర్ని, కూతురు క్లోరుూని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాడు. ఆయాసపడే ఇద్దరికీ కార్టిజోన్ ఇంజక్షన్స్ ఇచ్చాక డాక్టర్ టామ్‌ని పక్కకి పిలిచి చెప్పాడు.
‘ఇంకో చలికాలంలో ఇక్కడే ఉంటే వీళ్లిద్దరూ బతకరు. కొత్త అలర్జీలతో మళ్లీ ఆస్త్మా వస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జీవించి ఉండరు. కాబట్టి మీ కుటుంబం మసాచుసెట్స్‌ని వదిలి ఫ్లోరిడా లాంటి వేడి ప్రాంతానికి వెళ్లి ఉండటం ఉత్తమం.’

07/16/2017 - 00:24

‘మీకోసం ఓ అమ్మాయి వచ్చింది. పేరు మిస్ ఏన్. మీతో అపాయింట్‌మెంట్ ఉందని చెప్పింది’ జీనోకి అతని అపార్ట్‌మెంట్ వాచ్‌మేన్ ఇంటర్‌కం ఫోన్‌లో చెప్పాడు.
‘అవును. ఆమెని లోపలకి పంపు’ జీనో కోరాడు.

07/08/2017 - 23:44

ఓ కారు వచ్చి చీకటి సందులో ఆగింది. అందులోంచి ఓ శవాన్ని బయటకి పడేసాక కారు వెళ్లిపోయింది. రోడ్ల మీద నివసించే నేథన్ కారు వెళ్లాక చూస్తే శవం కనిపించింది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి జేబులు వెతికాడు. ఖాళీ. శవానికి ఉన్న తెల్లటి బూట్లు అతన్ని ఆకర్షించాయి. తన చిరిగిపోయిన బూట్లని విప్పి వాటిని తొడుక్కున్నాడు.

07/05/2017 - 00:12

లూకాస్ టేక్సీని ఆపి కిందకి దిగి ఎదురుగా ఉన్న ఇంటి తలుపుని తట్టాడు. గెరాల్డైన్ వీలర్ తలుపు తెరచి చెప్పింది.
‘లోపలికి రా. నా పెట్టెని తీసుకెళ్లు’
లూకాస్ ఆమె వెంట మెట్లెక్కి పైకి వెళ్లాడు. ఆ ట్రంక్ పెట్టె చాలా బరువుగా ఉంది. దాన్ని భుజాన ఎత్తుకుని అడిగాడు.
‘ఇదొకటేనా మిస్ గెరాల్డైన్?’
‘అవును లూకాస్. మిగిలిన పెట్టెలని ఇప్పటికే క్రూజ్‌కి పంపేసాను. ఇంక బయలుదేరుదాం’

06/24/2017 - 21:29

అలవాట్లు వదలడం కష్టం. మరణించి ఏభై ఏళ్లైనా సరే.
నేను మిమోసా హాల్‌లో బట్లర్‌గా పని చేసేప్పుడు డోర్ బెల్ మోగితే దాన్ని తెరవడం నా బాధ్యతల్లో ఒకటి. ఇప్పుడు నేను ఆ పని చేయక్కర్లేదని మర్చిపోతూంటాను. తలుపు దానంతట అదే తెరచుకోవడం చూసి అంతా భయపడుతూంటారు. ఇప్పుడు మిస్ పోలీ లేదా మార్తా తలుపు తెరుస్తూంటారు.

06/17/2017 - 23:38

ఫిలిప్ తన ప్రియురాలు ఫ్లోరా అపార్ట్‌మెంట్‌లో కూర్చుని ఉన్నాడు. తనకన్నా వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఫ్లోరా తనని ప్రేమించడం తన అదృష్టంగా నలభై మూడేళ్ల ఫిలిప్ భావిస్తాడు. తన భార్య తను ఓవర్‌టైం చేస్తున్నాడని భావించిన అనేక సందర్భాల్లో ఫిలిప్ ఫ్లోరాతో కలిసి ఖరీదైన రెస్ట్‌రెంట్లలో భోజనానంతరం డేన్స్ చేస్తూంటాడు.
‘నా వల్ల నీకు ఆనందంగా ఉందా?’ ఫ్లోరా మత్తుగా చూస్తూ అడిగింది.

Pages