S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/08/2018 - 20:05

కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పేరు వినగానే జంతువులకు కూడా హావభావాలు ఉంటాయా? అనిపించింది కదూ.. మనుషులకు ఉన్నట్లు జంతువులకు హావభావాలు లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో వాటి హావభావాలు నవరసాలను పోలి ఉంటాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఫొటోలు క్లిక్‌మనిపిస్తే ఆ ఫొటోలు అద్భుతంగా ఉంటాయి కదూ.. అలాంటి ఫొటోల్లో కొన్నింటిని 2018 కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలకు ఎన్నికయ్యాయి.

12/08/2018 - 19:58

ఇక రెండవ అంశం - రాసలీలా ఘట్టంలో పంచా ధ్యాయిలో వ్యాసభగవానుడు పదే పదే ఉపయోగించిన పదం-‘‘రమణ’’ శబ్దమే. ఈ శబ్దం ‘‘రము క్రీడాయాం’’ అనే ధాతువులోంచి వచ్చింది. ఇక్కడి క్రీడ బాలక్రీడే. ఇక్కడి బాలికలు గోపికలే గాని పురుషోత్తము డైన శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. అందుకే వ్యాసమహర్షి ఆ అధ్యాయాల్లో అనేక చోట్ల ‘‘రమయాంచ కార’’ (ఆడింపజేసెను) (్భగ-10, అధ్యా-39, శ్లో-49) వంటి పదాలనే అధికంగా ప్రయోగించాడు.

12/08/2018 - 18:49

గోపీ, రాధలది పెద్దలు చేసిన పెళ్లి. అంటే అరేంజ్డ్ మ్యారేజీ అన్నమాట. గోపీకి హైదరాబాద్‌లో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మనిషి హ్యాండ్‌సమ్‌గా వుండి ఆకర్షిస్తుంటాడు. మితభాషి. అలాగని ఆలోచనలకేమీ తక్కువ లేదండోయ్.

12/08/2018 - 18:31

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ కరోలినా రీపర్. కరోలినా రీపర్ నుంచి సగటున 15, 69, 300 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ ( ఎస్‌హెచ్‌యూ) ఉత్పత్తి అవుతాయి. 2013లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పేర్కొంది. దక్షిణ కరోలినాలోని పకర్‌బట్ పెప్పర్ కంపెనీకి చెందిన ఎడ్‌కర్రీ ఈ మిరప సృష్టికర్త. దీనిని సృష్టించడానికి ఆయనకు పదేళ్లు పట్టింది.

12/01/2018 - 22:19

కొన్ని పనులు చేయాల్సిన అవసరం వున్నా
చేయాలని అన్పించదు.
మనతో సాధ్యం కాదని అన్పిస్తుంది.
భయం వేస్తుంది.
విజయం వుంటుందో వుండదోనని అన్పిస్తుంది.
వైఫల్యం మనని వెంటాడుతుంది.
పర్వాలేదు.
ఆ పనిని చేయండి.
ఎలాగైనా సరే చేయండి.
చాలాసార్లు
చాలా పనులని వాయిదా వేస్తాం.
కథలు రాయడాన్ని కథకులు
చిత్రాలని చిత్రకారులు

12/01/2018 - 20:06

చెట్లపైన బదులు నేలమీద గూళ్లు కట్టే వింతపక్షులు.. చెంగుచెంగున గంతులేసే విభిన్న వర్ణాల ఎలుకలు.. పొడవైన తోకల్ని ఊపుతూ సందడి చేసే కోతులు.. కాంతులీనే ఆకుపచ్చటి తొండలు.. వివిధ రంగుల్లో మెరిసిపోతూ గాలిలో చక్కర్లు కొట్టే విహంగాలు.. ఇలాంటి జీవజాలంతో అండమాన్, నికోబార్ దీవులు సరికొత్త అందాలతో పర్యాటకులకు నిత్యం స్వాగతం పలుకుతుంటాయి..

12/01/2018 - 20:03

పదకొండవ దృక్కోణం :-
‘‘శ్రీకృష్ణుడు ఎంత సర్వాంతర్యామి అయితే మాత్రం, అధర్మ ప్రవృత్తి తగునా?’’ అనే సందేహం నిన్ను వదలకుండా వుంది. కానీ, భగవంతుడికి ఒక సమస్య వుంది. జీవులు బహిర్ముఖులై వున్న సమయాలలో, వారి హృదయాలను శృంగార రసం పట్టి గుంజుతూ వుంటుంది. అలాంటి జీవులను ఆయన ఉద్ధరించాలి. అంటే, వారికి శృంగారభావన లేకుండా చేయాలి.

12/01/2018 - 19:12

అది బృందావనము. వన రాజముల తలదన్ను సౌభాగ్యమొందిన రాణి వనము.
వురవళ్ల పరవళ్ల యమున
తా తగ్గి కదలని తరంగములే
కనులై నలు దిక్కుల చూచు చుండెను
గోపికలు తెచ్చిన నీటి కుండలు అదేమి చిత్రమో గాని నీటిలో మునిగి వుండీ ఎంతవరకూ నీరు నింపుకోవాయే.
భానుడు, నేనింక రాకుండా ఉండలేను, మీ స్నానాదికములు కానింపుము త్వరపడి యన్ననూ కదలరాయే భామలు.
గోప బాలురూ పశుసంపద

12/01/2018 - 18:58

ఏనాటి నుండియో ఈ పుణ్యభారతి
విశ్వగురువుయయి వెలసెనిచట
విద్యల కాణాచి వేద సంస్కృతినిచ్చి
జగతి దేశాలలో ప్రగతి దెచ్చె
సంస్కృతిన్ ప్రభవించు సంస్కారములనిచ్చు
విద్యలన్ గరపిన విమలచరిత
ఈజిప్టు మొదలుగా ఎన్ని జాతులకొయా
విజ్ఞానసుధలిచ్చి వెలుగునిచ్చె
పశ్చిమాత్యుల కుట్రలన్ భంగపడియు
జగతి సౌఖ్యమే కాంక్షించు జాతి మనది
మన పునాదుల గుర్తించి మరలమనగ

11/24/2018 - 20:03

హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతాల నడుమ మారుమూల స్పితి లోయలో ఉన్న హిక్కిం పోస్టాఫీసు అది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన పోస్టాఫీసు ఇది. సముద్ర మట్టానికి దాదాపు 4, 400 మీటర్ల ఎత్తులో ఉంది ఈ పోస్టాఫీసు. ఇక్కడి నుండి ప్రపంచంలోని నలుమూలలకూ ఉత్తరాలు వెళుతుంటాయి. భూగోళంపై అత్యంత ఎత్తులో ఉన్న నివాస ప్రాంతాల్లో స్పితి లోయ ఒకటి. ఇదో కొత్త ప్రపంచం.

Pages