S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

10/30/2017 - 18:50

వెనె్నలలో వచ్చిన కథతోనే కాసుల పంట వ్యాసం బాగున్నా కొన్ని అంశాల్లో విభేదించక తప్పదు. మల్లీశ్వరి, ఏకవీర లాంటి చిత్రాలు మంచి కథలున్నా ఆర్థికంగా ఫ్లాప్ అయ్యాయి. ప్రేమ్త్రన్ ధన్ పాయో, కబాలి లాంటి చిత్రాలు జనామోదం పొందకపోయిననా సూపర్ హిట్ అయ్యాయి. దేవదాసు చితానికి ఎంత ఘనమైన పేరు వచ్చినా దానికి లభించిన స్వర్ణ పతకాలు అమ్మేసి శతదినోత్సవాలు జరిపినట్టు స్వయంగా నిర్మాతే వాపోయాడు!

10/30/2017 - 18:49

మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన స్పైడర్ విభిన్నంగా వుంది. తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక ఇంటిలింజెంట్ పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ బాబు నటన అద్వితీయంగా వుంది. ఒక విపరీతమైన మానసిక సమస్యతో బాధపడుతూ తన సైకిక్ మనస్తత్వం కారణంగా సమాజానికి ఎంతో ప్రమాదకరంగా తయారైన భైరవ పాత్రలో ఎస్.జె.సూర్య నటన అద్భుతం.

10/30/2017 - 18:45

మాస్ ఇమేజ్ మాయలో పడకుండా మంచి కథలనే ఎంచుకుని నటిస్తూ సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా గొప్ప సాహసంతో తన సినిమాలను విడుదల చేస్తూ పెద్ద హీరోల సినిమాల ప్రభావం పడకుండా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న గ్రేట్ హీరో శర్వానంద్. మహానుభావుడు సినిమాలో హాస్య రసాన్ని అలవోకగా పండించి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. కథా కథనాలను నమ్ముకుంటేనే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు.

10/23/2017 - 18:33

భర్తనుంచి విడిపోయి అమలాపాల్ పెద్ద తప్పు చేసిందని ఆమె నటజీవితం ఖతం అంటూ జోస్యాలు చెప్పారు సినీ పండితులు. కానీ ఆమె పుంజుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె సిగరెట్ పీల్చుతున్న వీడియోలు వైరల్ అవగా సినిమా సినిమా సన్నివేశంలో సిగరెట్ కాల్చి ఆమె చాలా రిస్క్‌లో పడిదంటూ ఘోష! టాలీవుడ్‌లో తక్కువే గాని బాలీవుడ్ సిగరెట్ పీల్చే భామలు ఎక్కువే. సిగరెట్టే కాదు మద్యం, సహజీవనాలు మామూలు విషయాలు అయిపోతున్నాయి.

10/23/2017 - 18:32

చిరువ్యాసం ‘చివరి రోజు ల్లో’ మా మనసుల్ని కలచివేసింది. ఆ రోజుల్లో నటీనటులంతా భోళా భాళా! పారితోషికం గురించి పెద్ద గా పట్టింపు వుండేది కాదు. ఇచ్చింది పుచ్చుకునేవారు. విశాల హృదయంతో ఆర్తులకు అప్పులిచ్చి ఆదుకునేవారు. అప్పు తీర్చకపోయినా నిలదీసేవారు కాదు. ఈ ఔదార్యమే చాలామంది కొంప ముంచింది. మద్యానికి బానిసలై మునిగిపోయిన వారు వుండేవారు. ఈనాటి విద్యావంతులైన నటీనటులు డబ్బు విషయంలో జాగ్రత్తగా వుంటున్నారు.

10/23/2017 - 18:31

నేను రాసిన ‘ఏం లాభం?’ లేఖకు ప్రతిగా వచ్చిన ‘సూచక’ లేఖ చూశాను. నయాదౌర్, హమ్‌దోనో, చోరీ చోరీ చిత్రాలకు రంగులు అద్దినట్లు ప్రచారంగాని, ప్రకటనలు గాని నేను చూడలేదు. మాకు సమీప పట్టణాలు కాకినాడ, రాజమండ్రిల్లో మొఘల్-ఎ-అజం తప్ప మిగిలిన హిందీ చిత్రాలేవీ రాలేదు. బహుశా సడీ సవ్వడి లేకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయేమో! ఏదేమైనా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు రంగులు అద్దడం లాభసాటి కాదు.

10/23/2017 - 18:30

దసరాకు విడుదలైన చిత్రాల్లో జూ.ఎన్టీఆర్ ‘జై లవకుశ’ త్రిపాత్రాభినయ చిత్రం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన అత్యద్భుతం. పాటలు రెండు బాగున్నాయి. ఫైటింగ్స్, లొకేషన్స్, ఫొటోగ్రఫీ, డైలాగులు ఫర్వాలేదనిపించాయి. మిగతా పాత్రధారులు మెప్పించారు. దర్శకుని నైపుణ్యం, నిర్మాతల సహకారం మరువరాదు, సాంకేతిక నిపుణులతో సహా.
-సాయి మన్విత, బాగ్ అంబర్‌పేట

10/23/2017 - 18:28

గుండమ్మ కథకు మూలం షేక్‌స్పియర్ ‘టేమింగ్ ఆఫ్ ద ష్రూ’ అన్న ఆంగ్ల కథకు స్వేచ్ఛానువాదం ‘బహదూర్ గండ’ పేరుతో ‘బీచి’ అన్న కన్నడ ప్రసిద్ధ హాస్య రచయిత చేసినారు. ఆ కథ ఆధారంగా ‘గుండమ్మ కథ’ను విజయావారు మన తెలుగుతనం ఉట్టిపడేలా తీర్చిదిద్దినారు. దానినే మళ్లీ కన్నడిగులు ‘నంజుండ కల్యాణ’ పేరుతో రీమేక్ కొట్టినారు. మళ్లీ డబ్బింగ్ లేదా రీమేక్‌తో తెలుగులోకి తెచ్చారు.

10/23/2017 - 18:26

దర్శక దిగ్గజం ఎస్.జె.సూర్య సైకో విలన్‌గా నటించిన ‘స్పైడర్’ చిత్రం మాస్ ప్రేక్షకులకే కాక మేధావులు, క్లాసికల్ వారికి విపరీతంగా నచ్చింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు చేసిన ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర బాగా పండింది. భైరవ పాత్రలో సైకో కిల్లర్‌గా ఎదుటివాడు చస్తే సంబరపడే పాత్రలో ఎస్.జె.సూర్య నటన హీరోను బీట్ చేసింది. సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ ద్వారా హాస్పిటల్ బ్లాస్ట్ దృశ్యాలు టెన్షన్‌కు గురి చేసాయి.

10/16/2017 - 19:49

సినిమాని కాక పరిశ్రమలోని వ్యక్తుల్ని తిట్టడం సినిమా ప్రమోషన్‌లో భాగం అయిపోతున్నది. ఇందులో కంగనాది అందెవేసిన చేయ! ఆమె నటించిన చిత్రం రంగూన్ విడుదల ముందు హృతిక్ తనని అన్ని విధాలా వాడుకున్నాడని ఆరోపించి అభిమానుల సానుభూతి పొంది చిత్రం హిట్ చేసుకుంది. ఆ దెబ్బతో హృతిక్ భార్య భారీ మొత్తం గుంజుకుని విడాకులు తీసుకుంది.

Pages