S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/17/2016 - 21:01

ఏ ముహూర్తాన స్క్రీన్‌మీదకు అడుగు పెట్టిందోగాని -కీర్తి ట్రాక్ మిగితా హీరోయిన్లకు సెపరేట్‌గా సాగుతోంది. క్యూట్‌గాళ్‌గా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కీర్తి -తమిళంలో మాత్రం యమ స్వీడ్‌గా ప్రాజెక్టులు అందుకుంటోంది. తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండటంతో -తెలుగులో అవకాశాలు వస్తున్నా ఆలోచించి అడుగులేస్తోందట.

10/17/2016 - 20:59

పుణ్యమూర్తుల అప్పలరాజు, రాజమండ్రిలో మాస్టారుగా ఉద్యోగం చేస్తూ నాటకాలలో హాస్య పాత్రల్లో నటిస్తూ మిమిక్రీ ద్వారా ప్రజలను వినోదపరుస్తున్న కాలం. అలాంటి రోజుల్లో మిత్రుల ప్రోత్సాహంతో మద్రాస్ రైలెక్కాడు సినిమా వేషాల ప్రయత్నంలో. అప్పటికి అగ్రశేణి హాస్య నటుడిగావున్న రేలంగి సొంత సినిమా ‘సమాజం’ మొదలైంది. అదృష్టవశాత్తూ ఆ చిత్రంలో అవకాశం లభించింది అప్పలరాజుకి.

10/17/2016 - 20:52

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా/జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా.. హాయిగా ఆలూమగలై కాలం గడపాలి.. శివగోవింద గోవింద/ హరి గోవింద గోవిందలాంటి పాత పాటలు వింటుంటే పిల్లతెమ్మెరలాంటి పాప కళ్లముందు మెదలాడక మానదు.

10/17/2016 - 20:45

చేసింది రెండు మూడు సినిమాలే అయినా -చిన్న సినిమాల స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చేసుకుంది యాంకర్ రష్మి. ఇప్పుడు తన కెరీర్‌ను మరోమెట్టు పైకి ఎక్కించేందుకు నిర్ణయించుకుందట. పెద్ద ప్రాజెక్టుల్లో స్టార్ హీరోల సరసన చాన్స్‌లు పట్టే అవకాశం తక్కువే కనుక -కనీసం ఐటెమ్స్‌తోనైనా టాప్ హీరోల పక్కన కనిపించాలని నిర్ణయించుకుందట. సో.. రష్మి ఐటెమ్ సాంగ్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మాట.

10/17/2016 - 20:44

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

10/10/2016 - 22:31

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

10/10/2016 - 22:28

ఏ రోటికాడ ఆ రోటి పాట పాడాలన్న సామెత సంజనకు తెలీదేమో. వచ్చింది కన్నడ పరిశ్రమ నుంచే అయనా, కన్నడ సినిమాలన్నీ డబ్బా సినిమాలంటూ వ్యాఖ్యానించి నిర్మాతల ఆగ్రహానికి గురైంది. ఓ చానెల్‌కు బైట్స్ ఇస్తూ ఈ విషయాన్ని నోరు జారేసిందట. చివరికి నిర్మాతల ఆగ్రహానికి గురై మండలికి సారీ చెప్పుకుంది.

10/10/2016 - 22:27

ఈ రసవంతమైన సరస శృంగార గీతం 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోనిది. విజయా సంస్థ ఆస్థాన విద్వాంసుడు, ఎన్నో హిట్ పాటల కవివరేణ్యుడు పింగళి నాగేంద్రరావు కలం నుంచి సుకుమారంగా జాలువారిన పాట ఇది. అటు పండిత లోకాన్ని ఇటు పామర జనాన్ని పరవశింపజేసింది. నాయకుడు శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్, అలకపాన్పు ఎక్కిన నాయిక సత్యభామ పాత్రను జమున పోషించారు.

10/10/2016 - 22:24

శ్రీకృష్ణపాండవీయం ఒక కళాఖండం. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందించిన శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలు అద్భుతం. లక్క ఇల్లు తగులబెట్టే సన్నివేశానికి ముందు భీమ పాత్రదారి ఉదయ్‌కుమార్‌ను ఉద్దేశించి ‘మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా’ అంటూ కృష్ణుడు పాడే పాట మొద్దునిదుర పోయేవాళ్ళకు చక్కటి గుణపాఠం. ‘చాంగురే బంగారు రాజా/ చాంగు చాంగురే బంగారురాజా’ అంటూ జిక్కీ పాడిన పాట ప్రజల మన్ననలు అందుకుంది.

10/10/2016 - 22:21

వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గణేష్’ చిత్రంతో ప్రారంభించి -ఎందుకంటే ప్రేమంట, జంక్షన్, మిస్టర్ రాస్కెల్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి, దాదాపు 16ఏళ్ల అనుభవంతో కొమ్మి సూర్యనారాయణ తాజాగా రూపొందిస్తున్న చిత్రం -ఆమె అతడైతే. ఈ చిత్రంతో దర్శకుడిగా తనకు గుర్తింపు వస్తుందంటున్న కొమ్మితో చిట్ చాట్.

Pages