S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/03/2016 - 21:22

వినడానికే ఈ పదం గమ్మత్తుగా ఉంది కదూ! కానీ, బాలీ, టాలీవుడ్ పరిశ్రమల పరుగు చూస్తుంటే ఈ ఉపమానం కరెక్టే అనిపిస్తుంది. ఒకప్పుడు -సినిమా విజయమనేది, థియేటర్లలో ఆ సినిమా నడిచే కాలాన్నిబట్టి లెక్క తేలేది.

10/03/2016 - 21:12

నిదానమే ప్రధానం -అన్న తెలుగు నానుడికి తమిళ రూపమిస్తే కీర్తి సురేష్‌లా ఉంటుంది. ఇది నిన్నటి మాట. ఆహార్యం, అభినయం రెండూ కలబోసినట్టుండే కీర్తి -ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. రామ్‌తో ‘నేను-శైలజ’లో కనిపించి హిట్టందుకున్న కీర్తి రెండో ప్రాజెక్టుకు కాస్త టైం తీసుకుంది.

10/03/2016 - 21:10

సినిమాకు కథావస్తువు ఏదైనా కావొచ్చు. కానీ -ఆ వస్తువు నుంచే హాస్యం పుట్టి, అందులోనే మిళితమైన ఉన్నపుడే జనరంజకం అవుతుంది. స్వర్ణయుగం కాలంలో అలాంటి హాస్య పాత్రల్లో నటించి రక్తికట్టించిన జంటలను మనమింకా మర్చిపోలేక పోతున్నాం. అందుక్కారణం -ఆయా కథా వస్తువుల నుంచి పుట్టించిన సున్నితమైన హాస్యం, ఆ హాస్యానికి ప్రాణం పోస్తూ పాత్రల్లో ఒదిగిపోయిన గొప్ప నటుల ప్రావీణ్యం.

10/03/2016 - 21:07

‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ‘గరం’ చిత్రానికి కథ, మాటలు అందించి రచయితగా, దర్శకుడిగా తన కత్తికి రెండువైపులా పదునుందని నిరూపించుకున్న
గవిరెడ్డితో ఈవారం చిట్‌చాట్.
మీ నేపథ్యం?
వైజాగ్ దగ్గర నర్సీపట్నం వద్ద బయ్యవరం మావూరు. డిగ్రీ చదివాను. దర్శకత్వంపై ఆసక్తితో ఇలా వచ్చాను.
దర్శకుడిగా ఎలా?

,
10/03/2016 - 21:05

ఔను, నిజమే! ఎల్వీ ప్రసాద్ వంటి ఒక మహామనీషి సినీ నిర్దేశికత్వం; రచనపరంగా నవ్యపంథాలో సంచలనాన్ని సృష్టించిన గోపీచంద్; నటనలో ఆరితేరిన శతమతుల భానుమతి; వారిని సమన్వయపర్చి సెల్యులయిడ్‌పై అద్భుతానికి శంఖారావంవూది తెర వెనుక చక్రం తిప్పిన వైతాళికుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు)... వీరి మేధోమథనంతో రూపుదిద్దుకొన్న సారథివారి ‘గృప్రవేశం’ చిత్రం 1946 అక్టోబర్ 4న విడుదలైంది.

10/03/2016 - 20:51

ఎన్టీఆర్ నటించిన గుడిగంటలు చిత్రంలో సినారె గీతం -జన్మమెత్తితిరా/ అనుభవించితిరా. ఈ పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించడమేకాదు ఆలోచింప చేసింది. ఆవేశంతో వ్యవహరించే వ్యక్తుల జీవిత గమ్యాలు ఎంత విషాదభరితంగా ఉంటాయో తెలియజెప్పే పాత్ర ఎన్టీఆర్‌ది.

10/03/2016 - 20:49

1962లో ఒకే నెలలో విడుదలైన రెండు జానపద చిత్రాలు -జగదేకవీరుని కథ, గులేబకావళి కథ. రెంటిలో రామారావు హీరో. ఇక ముక్కామల రాజుగా, లంక సత్యం, పేకేటి శివరాం, కెవిఎస్ శర్మ, ఋషేంద్రమణి, ఛాయాదేవి, హేమలత, సురభి బాలసరస్వతి, బాలకృష్ణ, పద్మనాభం లాంటి వారంతా చిత్రంలో ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తారు. బాలకృష్ణ, సురభి బాల సరస్వతి రెండు హాస్య పాత్రల్లో రాణించారు.

10/03/2016 - 20:46

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

09/26/2016 - 23:21

సెలబ్రిటీలు ఎలాంటి డ్రెస్సులేసినా -చెల్లిపోయే కాలమిది. కావాలని అందాలు కనిపించేలా డ్రెస్సులేస్తుంటే -్ఫటోలు తీసుకుని నెట్‌లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ స్టయిల్ మరీ ముదిరిపాకన పడటంతో -హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌కు మరీ లెక్కలేకుండా పోయింది. నడుమొంపు చూపాలంటే ఒక తరహా డ్రెస్. క్లీవేజ్ షోకు మరోరకం డ్రెస్.

09/26/2016 - 22:43

కథ: సదాశివబ్రహ్మం
మాటలు: ఆరుద్ర
పాటలు: కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర,
ఫొటోగ్రఫీ: వినె్సంటు
ఎడిటింగ్: ఎ సంజీవి
కళ: కృష్ణారావు, సుబ్బారావు
నృత్యం: హీరాలాల్, పసుమర్తి,
అసోసియేట్ దర్శకులు:
ప్రత్యగాత్మ, కోగంటి
సహాయ దర్శకులు:
తాతినేని రామారావు
దర్శకత్వం: టి ప్రకాశరావు
నిర్మాత: ఏవి సుబ్బారావు.
***

Pages