S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/07/2016 - 21:48

గృహప్రవేశం హీరో పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందా? అనే విషయంపై చర్చలు జరిగాయి. కొన్ని పేర్లు అనుకున్నప్పటికీ ముంబయిలో తన ప్రతిభను ప్రదర్శిస్తున్న తెలుగుతేజం ఎల్వీప్రసాద్ చేత ఆ పాత్ర వేయిస్తే బాగుంటుందని అంతా అభిప్రాయపడ్డారు. అప్పటికే ఆయన తెలుగులో తెనాలి రామకృష్ణ, చదువుకున్న భార్య, ఘరానాదొంగ చిత్రాల్లో నటిస్తూ దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. హెచ్‌ఎం రెడ్డి ద్వారా ఆయనను సంప్రదించారు.

11/07/2016 - 21:43

రచన: ఆచార్య ఆత్రేయ
కళ: జివి సుబ్బారావు
కూర్పు: అక్కినేని సంజీవరావు
నృత్యం: హీరాలాల్
ఫొటోగ్రఫీ: సి నాగేశ్వరరావు
స్టంట్స్: రాఘవులు
సంగీతం: కెవి మహదేవన్
అసోసియేట్ దర్శకుడు: పిసి రెడ్డి
దర్శకుడు: వి మధుసూధనరావు
నిర్మాత: విబి రాజేంద్రప్రసాద్.

11/07/2016 - 21:27

అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించిన స్నేహ ఉల్లాల్ గుర్తుందిగా. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో ‘లక్కీ’ ఎంట్రీ ఇచ్చి, తరువాత తెలుగులో పలు చిత్రాలు చేసింది. హీరోయిన్‌గా కమర్షియల్ విజయం దక్కకపోవడంతో ఐటెం గర్ల్‌గా, కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం లేకపోయంది. ఇక లాభం లేదనుకున్న ఉల్లాల్, చాలామంది హీరోయన్లలాగే ఓ ఘాటు ఫొటో పోస్ట్ చేసి ఇండస్ట్రీలో పొగలు రేపుతోంది?

11/07/2016 - 21:58

సరైన సినిమా ఒక్కటి పడగానే -రెమ్యునరేషన్ రెండింతలు చేయటం టాలీవుడ్ హీరోయన్లకు కొత్తేం కాదు. డిమాండ్ ఉన్నపుడే డబ్బు చేసుకోవాలన్న ఆలోచనను ఆధునిక హీరోయన్లు వంటబట్టించుకునే ఇండస్ట్రీకి వస్తున్నారు. ఫలానా సినిమాకు ఫలానా హీరోయన్ సూటవుతుందని దర్శకుడు బలంగా ఫిక్సయ్యాడంటే -అది నిర్మాత చావుకొచ్చినట్టే. ఎందుకంటే -ఫలానా అమ్మాయే కావాలనుకుంటే అడిగినంత ఇచ్చుకోక తప్పదు. తప్పదనుకున్న నిర్మాతలు ఒప్పుకుంటున్నారు.

11/07/2016 - 21:10

చూరు పట్టుకు వేలాడుతున్నా చాన్స్‌లు రావడం లేదంటూ తెగ
ఇదైపోతుందట ఇలియానా. తెలుగు స్క్రీన్‌మీద స్టయిలిష్ షేపుల్ని ఆరేసి -మొదటి సినిమా దేవదాసుతోనే ‘వావ్’ అనిపించిన ఇలియానా, ఇప్పుడు వేషాలు కోసం వెయిట్ చేస్తోందంటే విచిత్రమే. నిజానికి -ఆదిలోనే ఆమె అందానికి ఫిదా అయిపోయి అందలమెక్కించడమే కాదు, టాప్‌స్టార్‌ని చేసేసింది

11/07/2016 - 21:08

రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ బ్యానర్‌పై పద్మనాభం నిర్మించిన ప్రథమ చిత్రం దేవత, 24 జూలై 1965 విడుదలైంది. చిత్రంలో సినిమా తారలను అభిమానించే ఒక వీరాభిమాని తన అభిమాన తారల ఇళ్ళకు వెళ్ళి కలసి ముచ్చటించే సన్నివేశం ఆ చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవటమే కాకుండా, అభిమానులలో స్నేహభావం కూడా ఏర్పడి కళారంగ అభివృద్ధికి తోడ్పడింది. స్నేహం అంటే ముందు గుర్తుకు వచ్చేది పద్మనాభం.

11/07/2016 - 21:06

-రవీంద్ర సూరి

ఒక జోనర్‌లో సీక్వెన్స్ సినిమాలు వచ్చినపుడు ‘ట్రెండ్’ అనుకోవడమే తప్ప, ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేకమైన ట్రెండ్ అంటూ ఏమీ ఉండదంటున్నాడు కొత్త దర్శకుడు రవీంద్ర సూరి. లఘు
చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి
‘చెంబు చిన సత్యం’ సినిమాతో
పరిశ్రమలో మెయిన్‌స్ట్రీం దర్శకుడిగా గుర్తింపు పొందిన సూరితో
ఈ వారం చిట్‌చాట్

11/07/2016 - 21:04

సూపర్ హిట్ మూవీ అంటూ బుల్లితెర ఛానళ్లలో నిరంతరం తెలుగు చిత్రాలు ప్రదర్శిస్తున్నారు, సంతోషం. ఫలానా చిత్రమని తెలియగానే ‘అరె ఈ సినిమా ఎప్పుడొచ్చింది?. సినిమా పేరే వినలేదే? పేపర్లోనో పోస్టర్‌పైనో దీనిగురించి చూడనైనా చూళ్లేదుగా. బహుశ, బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన సినిమా అయివుంటుంది. అందుకే.. చానెల్‌కు వచ్చేసింది’లాంటి అభిప్రాయాలు వీక్షకులు వెలిబుచ్చడం సర్వసాధారణమైంది.

11/07/2016 - 21:02

బిఎ సుబ్బారావు శోభనాచలవారు సంయుక్తంగా 1950లో చిత్రీకరించిన పల్లెటూరి పిల్ల ఇప్పటికీ, ఎప్పటికీ గొప్ప చిత్రమే. పల్లెల గొప్పదనాన్ని ఆనాడే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రారంభంనుండి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. శాంతవంటి పిల్ల లేదోయి అని ఘంటసాలవారి గానం అద్భుతంగా వుంది. ఎన్టీఆర్ జయంతుడిగా, ఎఎన్‌ఆర్ వసంతుడిగా, అంజలీదేవి శాంతగా అద్భుతంగా నటించారు.

11/07/2016 - 20:59

కాంతారావు, దేవిక, రేలంగి, విజయనిర్మల నటీనటులుగా 1967లో వచ్చిన ‘పిన్ని’ చిత్రంలో ఆరుద్ర రాసిన ఓ పాట ఆలోచనాత్మకంగా వుంటుంది. టివి రాజు స్వరపరచిన ఈ పాటను సుశీల అద్భుతంగా గానం చేశారు. పాట ప్రారంభంలోనే విజయనిర్మలతో పిన్ని వరస అయిన దేవిక మాట్లాడుతూ ఆడదై పుట్టిన తర్వాత పడే పాట్లు, అనుభవాలు గుర్తు చేసుకుంటూ జోలపాట పాడుతుంది.

Pages