S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

,
08/22/2016 - 20:59

ఇటీవల చాలవరకూ పెద్ద హీరోల చిత్రాలు ఢమాల్‌మన్నాయి. కారణం -మూస కథలు.. పాత్రల సంవిధానం సరిగా లేకపోవడమన్నది ప్రేక్షకుల మాట. కానీ -‘అభిమానుల కోసం’ అంటూ కథలో, కూర్పులో హీరోలు వేళ్లూ కాళ్లూ పెట్టడం అసలు కారణమన్నది ఇండస్ట్రీ టాక్. పాత్రలపరంగానూ, కథలపరంగానూ ప్రయోగాలు చేయాల్సిన హీరోలు, ప్రయోగం పేరిట ఉన్నవాటిని కెలికేస్తుంటే -సినిమాలు అలాగే కుప్పకూలిపోతాయన్నది ఇండస్ట్రీలో సీనియర్ల విశే్లషణ.

08/22/2016 - 20:55

1972లో వీనజ్ మహిజా ఫిలింస్ బ్యానర్‌పై పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ప్రకాశరావు నిర్మించిన చిత్రం ‘బాల భారతం’. భారతంలో పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుని బాల్యాన్ని చూపే సన్నివేశాలతో రంగుల్లో నిర్మించిన సంగీత భరిత చిత్రమిది.

08/22/2016 - 20:53

‘నరుడా ఓ నరుడా.. ఏమి కోరిక?’ అంటూ భైరవద్వీపం చిత్రంలో సాగే గీతం నాకు చాలా ఇష్టమైన పాట. ఎన్టీఆర్ ‘పాతాలభైరవి’ తర్వాత అందులోని కొన్ని పోకడలున్న చిత్రంగా ‘్భరవద్వీపం’ తోస్తుంది. ఈ చిత్రం విడుదలైనపుడు జానపద ప్రియులు అందుకే పరుగులు తీశారు. బాలకృష్ణ తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుడిని మెప్పించడంలో సఫలమయ్యాడు.

08/15/2016 - 23:03

రచన: ఆరుద్ర
నృత్యం: చిన్ని సంపత్
కళ: వి కృష్ణారావు
కూర్పు: యన్‌ఎస్ ప్రకాశం
కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
డివొపి: రవికాంత్ నగాయిచ్
సంగీతం: టి చలపతిరావు
దర్శకత్వం: యం మల్లిఖార్జునరావు
నిర్మాతలు: డూండీ,
సుందర్‌లాల్ నహతా

08/15/2016 - 21:16

సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా భామ ఇలియానా ఇక్కడ మంచి క్రేజ్ ఉండగానే బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన ఈమెకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. దాంతో అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ తన హవాను ప్రూవ్ చేసుకోవడానికి హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో బాలీవుడ్ జనాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

08/15/2016 - 21:14

పదహారణాల తెలుగుదనంతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో పెద్దగా తెలీకపోవచ్చు. కానీ, ఆమె పక్కనే నిలబడిన నవనాగరిక యువతి కాస్త తెలిసినట్టుగానే అనిపిస్తోంది కదూ!

08/15/2016 - 21:11

ప్రేక్షకుడు తిడితే -తిట్టారన్న ఏడుపేగాని, నిజానికి మన తెలుగు సినిమా కథలు ఎప్పుడివి చెప్పండి. ఒక్కో దశలో ఒక్కో ట్రెండ్ సృష్టించే కథను పట్టుకుని ఏళ్లతరబడి దానే్న నూరుతూ, కాస్త అటూఇటూగా అవే సన్నివేశాలు వండి వడ్డించేయడం ఏమైనా బాగుందా?
**

08/15/2016 - 21:17

సినిమా ఓ ఫ్యాషన్. అలాంటిది అనుకోకుండా అవకాశమొచ్చి -నటిస్తావా? అంటే కాదనేదేముంటుంది. హుస్సేన్ షా కూడా అలా వచ్చినవాడే. ఫ్రెండ్ పిలిచి సినిమాలో చేస్తావా? అంటే యస్ అన్నాడు. అలా ఆర్య-2లో కనిపించాడు. కట్‌చేస్తే -ఇప్పుడు డైరెక్టర్‌గా తన ప్రయత్నం సిన్సియర్‌గా చేశాడు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘మీకు మీరే- మాకు మేమే’ చిత్ర దర్శకుడు కిరణ్‌తో
ఈవారం చిట్‌చాట్

08/15/2016 - 21:05

నాకు బాగా నచ్చిన కళాత్మక చిత్రం -సిరివెనె్నల. అంధుడైన కళాకారుడి సంగీత ప్రతిభ, ఓ మూగ చిత్రకారిణి హృదయ వేదన, మాలిన్య స్ర్తి అమలిన త్యాగం.. మూడు పాత్రల ద్వారా హృదయంగమమైన సన్నివేశాలతో దర్శకుడు కె విశ్వనాథ్ సృజించిన అద్భుత సృష్టి -సిరివెనె్నల. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని స్పృశించినా ఒక అద్భుతమే.

08/15/2016 - 21:00

‘ఈ జీవన తరంగాలలో.. ఆ దేవుని చదరంగంలో..’ -యద్దనపూడి సులోచనారాణి నవలకి డి రామానాయుడు రూపాన్నిచ్చిన జీవన తరంగాలు చిత్రంలోనిదీ పాట. కన్నకొడుకులు తమ తల్లిదండ్రులను బ్యాంక్ బ్యాలెన్స్‌లా కాకుండా, కనిపెంచిన దేవుళ్ళుగా భావించాలని చెప్పే గొప్ప చిత్రమిది.

Pages