S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/05/2016 - 11:52

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాపరెడ్డి కుటుంబీకులు శనివారం 65 లక్షల రూపాయల విలువచేసే వెండి సింహవాహనాన్ని సమర్పించారు. ఈ నెల 7న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే వాహన సేవలో ఈ వెండి సింహ వాహనాన్ని వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

03/05/2016 - 07:21

గుంటూరు: రాజధాని అమరావతిని మనందరి నగరంగా తీర్చిదిద్ది, జూన్ 15 నుంచి ప్రజలకు ఇక్కడి నుంచే పాలనను అందించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం రూ. 28 కోట్ల విలువచేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

03/05/2016 - 07:12

నరసరావుపేట: కాపులకు న్యాయం చేస్తానని, బీసీల్లో చేరుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కాపులకు ఒక్కశాతం కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. సమాజ హితం కోసం కల్యాణ మండపాన్ని నిర్మించడం శుభ పరిణామమన్నారు.

03/05/2016 - 07:11

ప్రత్తిపాడు: మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని విశ్వశాంతికి పాటుపడుతున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ సేవ అనిర్వచనీయమని రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గుంటూరుకు సమీపంలోని విశ్వనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ 72వ జన్మదిన వేడుకల్లో మంత్రి రాఘవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగతికే స్వామీజీ విశ్వయోగి అని కొనియాడారు.

03/05/2016 - 06:59

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రూ.400 - 500లకే ఊడిగం చేస్తున్న 45వేల మంది ‘ఆశా కార్యకర్తలకు’ గత 16నెలలుగా ఆ కొద్దిపాటి జీతం కూడా రాకపోవడాన్ని నిరసిస్తూ సిఐటియు అనుబంధ సంస్థ ఎపి వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం చేబట్టిన చలో విజయవాడ ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు.

03/05/2016 - 06:57

గుంటూరు (లీగల్),: రాష్ట్రంలోని అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ చైర్మన్ల సమావేశం పలు అంశాలపై చర్చించనుందని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ల ఫెడరేషన్ చైర్మన్, గుంటూరు బార్ అధ్యక్షుడు జి శాంతకుమార్ శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుండి గుంటూరు బార్ అసోసియేషన్ నూతన సమావేశ మందిరంలో మెరుగైన న్యాయవ్యవస్థ కోసం చైర్మన్లతో చర్చ జరుగుతుందన్నారు.

03/05/2016 - 04:03

గుంటూరు: రాజధాని అమరావతిని అందరి నగరంగా తీర్చిదిద్ది జూన్ 15నుంచి పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం రూ.28 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

03/05/2016 - 03:59

కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధపడుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో ఇటీవల తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా సిఎం ఇచ్చిన హామీలపై ఈనెల 10లోగా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో 11నుంచి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.

03/05/2016 - 03:56

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌కు ఎగువనున్న నాగావళి- వంశధార- రుషికుల్య నదుల అనుసంధానంపై ఒడిశా చేపడుతున్న చర్యలు ఉత్తరాంధ్రకు ముప్పు తేబోతున్నాయి. ఈ అనుసంధాన ప్రక్రియను ఒడిశా సర్కార్ చకచకా పూర్తి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి పేరిట నందినీ కెనాల్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు టెండర్లూ పిలిచేసింది.

03/05/2016 - 03:50

హైదరాబాద్: ఆంధ్ర శాసనసభ, మండలి సమావేశాలు 5న సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు 18 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుమించి శాసనసభ కొనసాగింపు అంశంపై బిఏసిలో చర్చిస్తారు. 10న వ్యవసాయ బడ్జెట్, సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది.

Pages