S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/24/2015 - 15:07

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో గురువారం ఓ ఉన్మాది బీభత్సం సృష్టించి ఇద్దరిని బలిగొన్నాడు. ఆ ఉన్మాది తొలుత తన ఇంట్లో వదినను హత్య చేసి ఆ తర్వాత బస్టాండ్ వద్ద వీరంగం చేశాడు. ఉన్మాది దాడిలో నాగభూషణం అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన స్థానిక ఎంపిటిసి సభ్యురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకుని ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

12/24/2015 - 15:07

విశాఖ: విశాఖ జిల్లా తుమ్మపాల వద్ద గురువారం ఉదయం ఎక్సయిజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఓ తవుడు లారీలో రవాణా చేస్తున్న సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యాన్ని ఒడిశా నుంచి తెస్తున్నట్లు వారు చెబుతున్నారు.

12/24/2015 - 15:06

హైదరాబాద్: అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు తనకు ఆందోళన కలిగించిందని, ఇలాంటి ప్రవర్తనను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంత చెప్పినా వినకపోవడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశామన్నారు.

12/24/2015 - 11:54

గుంటూరు:ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి తల్లీ కూతురు మరణించిన సంఘటన చుండూరు మండలం ఎడ్లపల్లిలో గురువారం ఉదయం జరిగింది. ఇదే సంఘటనలో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.

12/24/2015 - 11:53

ఒంగోలు:శబరిమలైనుంచి శ్రీకాకుళం జిల్లాకు భక్తులతో వెళుతున్న ఓ బస్సు రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొనడంతో ఒకరు మరణించగా, 24మంది గాయపడ్డారు. పొంగులూరు మండలం, జాగర్లమూడివారి పాలెం వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు.

12/24/2015 - 11:51

విశాఖ:విశాఖ జిల్లా దేవరాపల్లిలో మంగళవారం కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ళ దివ్య హత్యకు గురైనట్లు పోలీసులు నిర్థారించారు. ఆమె మృతదేహాన్ని గురువారం ఉదయం రైవాడ వరద గేట్లవద్ద కనుగొన్నారు. మేనమామ తంబి దివ్యను అపహరించి ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

12/23/2015 - 17:41

అమలాపురం: తనకు తెలియకుండా 90 వేల రూపాయలు అప్పు తీసుకున్నందుకు భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. అల్లవరం మండలం బోడసకుర్రులో బుధవారం ఉదయం లక్ష్మి, ఆమె భర్త అప్పు విషయమై ఘర్షణ పడ్డారు. బాకీ తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నిలదీయడంతో ఈ దంపతులు గొడవ పడ్డారు.

12/23/2015 - 17:41

విశాఖ: ఏడేళ్ల బాలిక అదృశ్యంపై ఆమె మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో తన కుమార్తె కనిపించకుండా పోయిందని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని తల్లి ధనలక్ష్మి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేనమామ గుణశేఖర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

12/23/2015 - 16:49

అనంతపురం: ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసిన నలుగురు దళారులను స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుమారు 315 మంది నుంచి నిందితులు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానించిన బాధిత యువకులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై నిఘా పెట్టి ఎట్టకేలకు వారిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

12/23/2015 - 11:38

కాకినాడ: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. అల్లవరం మండలం బోధన్‌కుర్రుపాలెం లో బుధవారం లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన ప్రారంభించారు.

Pages