S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/26/2018 - 05:34

అమరావతి: ప్రకృతి వ్యవసాయం విశ్వవ్యాప్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) విధానం వల్ల ఆహారభద్రతతో పాటు మానవ జీవన కాలపరిమితి పెరుగుతుందన్నారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

09/26/2018 - 05:30

విశాఖపట్నం: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హౌరాలో ఆదివాసీలు చేపట్టిన ఆందోళనతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హౌరా నుంచి దేశం నలుమూలకు నడిచే పలు రైళ్ళు మంగళవారం రద్దయ్యాయి. హౌరా-సికింద్రాబాద్ (18645), హౌరా-చెన్నై (12841) కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా-కన్యాకుమారి (12665) ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి.

09/26/2018 - 04:56

* వాకౌట్ చేసి ప్లకార్డులతో టీడీపీ ఎంపీల నిరసన

09/26/2018 - 01:40

ఖమ్మం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న భద్రాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో అదనపు బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

09/26/2018 - 01:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమాను మావోయిస్ట్‌లు హతమార్చిన ఘటనపై పోలీసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనలోని లోపాలను ఓపక్క బేరీజు వేసుకుంటూనే మరోపక్క ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చురుకుగా ముందుకు కదులుతోంది.

09/26/2018 - 01:37

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్ట్‌లు పగడ్బందీ వ్యూహంతో మట్టుపెట్టడం వెనుక కుట్రలేమైనా దాగి ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు రక్షణ లేకుండా కిడారి గ్రామదర్శిని కార్యక్రమానికి ఎందుకు బయల్దేరారు? ఎమ్మెల్యే సహా పలువురు నాయకులు డుంబ్రిగుడకు వస్తున్న సమాచారాన్ని మావోయిస్ట్‌లకు ఎలా చేరింది?

09/26/2018 - 05:10

హైదరాబాద్, సెప్టెంబర్ 25: వచ్చే నెల అక్టోబర్ 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారిగా ఎన్నికల ప్రచార బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న వనపర్తి, 7న వరంగల్, 8న ఖమ్మంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని టీఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

09/26/2018 - 05:11

* ఆగిపోయిన కమిషన్ సర్వర్.. పనిచేయని బీఎల్‌ఓలు * తొలగని బోగస్ ఓట్లు

09/26/2018 - 02:24

హైదరాబాద్: ఓట్ల జాబితాల సవరణలో చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు, పార్టీ ఎన్నికల సంఘం కన్వీనర్ జీ నిరంజన్ విమర్శించారు. నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుమారు 700 కుటుంబాలకు చెందిన రెండు వేల ఓట్లను ఉన్నఫళంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి మార్చారని నిరంజన్ మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

09/26/2018 - 05:20

హైదరాబాద్, సెప్టెంబర్ 25: బతుకమ్మ పండుగకు విశ్వఖ్యాతి తీసుకువద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 9 న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ అక్టోబర్ 17 న సద్దుల బతుకమ్మతో పూర్తవుతుందన్నారు. ఈ పండగకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Pages