S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/09/2016 - 07:40

హైదరాబాద్, జనవరి 8: రెండుతెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలపై నెలకొన్న వివాదాలు కొలిక్కి రానున్నాయి. వచ్చే వారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ అథారిటీ నిర్ణయించింది. ఈమేరకు రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులను ఆహ్వానించనుంది. ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఖరారుకానున్నాయి.

01/09/2016 - 07:37

హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 18 నుంచి నంది నాటకోత్సవం -2015ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో 18న ప్రారంభమై 27వ తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. నంది నాటకోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గుర్తిస్తూ ఆ జివో పేర్కొంది.

01/09/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 8: అర్చకుల నియామకం విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తే, కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.

01/09/2016 - 07:34

హైదరాబాద్, జనవరి 8: మావోయిస్టులుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్న నకిలీ నక్సల్స్ ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, క్రీడాకారులకు సిపిఐ మావోయిస్టులుగా పేర్కొంటూ లెటర్‌హెడ్లపై బెదిరింపు లేఖలు రాసి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్నారు.

01/09/2016 - 07:26

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు , ఆందోళనలు చేసిన వైకాపా ఇపుడు తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు రహస్య మిత్రుడిగా మారిందని బహిరంగంగా మాత్రం ప్రత్యర్ధిలా వ్యవహరిస్తోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి అన్నారు.

01/09/2016 - 07:25

విజయవాడ (క్రైం), జనవరి 8: కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఈనెల 19వ తేదీ వరకు రిమాండు విధిస్తూ విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసు భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు. కాగా ఇదే సమయంలో విష్ణు తరుఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డిస్మిస్ చేశారు.

01/09/2016 - 07:25

హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఆయా ఉన్నత విద్యాభ్యాసం మేరకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి సంక్షేమ కమిషనర్ వివి పాండురంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

01/09/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 8: రెండుతెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలపై నెలకొన్న వివాదాలు కొలిక్కి రానున్నాయి. వచ్చే వారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ అథారిటీ నిర్ణయించింది. ఈమేరకు రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులను ఆహ్వానించనుంది. ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఖరారుకానున్నాయి.

01/09/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 8: అర్చకుల నియామకం విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు.

01/09/2016 - 07:23

హైదరాబాద్, జనవరి 8: జన్మభూమి కార్యక్రమం నిర్వహించినప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కారమైనట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

Pages