S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/27/2016 - 04:28

విజయవాడ, మే 26: వచ్చే నెల 27వ తేదీ నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులంతా అమరావతికి రావల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. జూన్ 27 నుంచి అమరావతినుంచే పాలన ప్రారంభిస్తామని చెప్పారు.

05/27/2016 - 04:25

తిరుపతి, మే 26: తెలుగుదేశం పార్టీ జాతీయ హోదా సాధనకు సిద్ధమవుతున్న తరుణంలో తొలిసారిగా తిరుపతి పుణ్యక్షేత్రంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగనున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. మహానాడు నిర్వహణకు ఏర్పాటైన 15 కమిటీలు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. దాదాపు 28 అంశాలపై ఈ మహానాడులో చర్చ చేయనున్నారు.

05/26/2016 - 00:48

హైదరాబాద్, మే 25: నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్సెట్ (మెడికల్ స్ట్రీం) పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఎమ్సెట్ -2కు సంబంధించిన షెడ్యూలు ఈ నెల 28న విడుదల కానుంది. జూలై 9న మెడికల్ ప్రవేశపరీక్ష నిర్వహించి 14న ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ 1నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

05/26/2016 - 00:47

హైదరాబాద్, మే 25: కృష్ణా జలాల వినియోగం, అక్రమ ప్రాజెక్టులపై ఆంధ్ర, తెలంగాణ మధ్య పరస్పర ఆరోపణలు తారాస్ధాయికి చేరుకున్న నేపథ్యంలో కృష్ణా బోర్డు సమావేశం 27న శుక్రవారం ఇక్కడ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇఎన్‌సిలు, సాగునీటి నిపుణులు హాజరవుతున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు, నీటి యాజమాన్యం తదితర 11 అంశాలపై చర్చ జరగనుంది.

05/26/2016 - 00:31

హైదరాబాద్, మే 25: దేశవ్యాప్తంగా ఉన్న 18 ఐఐటిల్లో చేరిన విద్యార్థుల ఛాయిస్ పరిశీలిస్తే టాపర్ల దృష్టి అంతా ఐఐటి ముంబైపై పడింది. గత మూడేళ్లుగా 10లోపు ర్యాంకులు వచ్చిన టాపర్లు అంతా ఐఐటి ముంబైలో చేరుతుండగా, రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ, మూడో స్థానంలో చెన్నై వచ్చి చేరింది. నాలుగో స్థానంలో ఐఐటి కాన్పూర్ ఉండగా, ఐఐటి ఖరగ్‌పూర్ ఐదో స్థానానికి వచ్చేసింది.

05/26/2016 - 00:28

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత (సెల్సియస్) వివరాలు ఇలా ఉన్నాయి.
నగరం/పట్టణం గరిష్ఠం కనిష్ఠం
రామగుండం 46 28
భద్రాచలం 45 32
బాపట్ల 45 30
మచిలీపట్నం 45 31
విజయవాడ 44 30
వరంగల్ 44 26
ఖమ్మం 44 32
ఒంగోలు 44 32
ఆదిలాబాద్ 43 29
నల్లగొండ 43 31
కాకినాడ 43 31
విశాఖపట్నం(ఎపి) 39 31

05/26/2016 - 00:40

హైదరాబాద్, మే 25: రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయనుండటంతో విపక్షాలు గెలిచే అవకాశం లేకున్నా పోటీ పడేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ విధానంలో విప్ జారీ చేసే అధికారం లేకపోయినా.. ఫిరాయింపు చట్టం కింద ఎలాంటి చర్యలకు వీలు లేకపోయినా..

05/26/2016 - 00:24

హైదరాబాద్, మే 25: రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పోటీ ఖాయమైంది. విజయసాయి రెడ్డి గురువారం ఏపి అసెంబ్లీలో నామినేషన్‌ను దాఖలు చేస్తారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

05/25/2016 - 08:21

హైదరాబాద్, మే 24: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్న తెలుగు సాహస యువతి నీలిమ రెండోసారి కూడా తృటిలో వైఫల్యాన్ని చవి చూశారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించి తీరాలన్న పట్టుదలతో నీలిమ ముందుకెళ్లినప్పటికీ 8,650 మీటర్లు మాత్రమే ఎక్కగలిగింది.

05/25/2016 - 08:21

హైదరాబాద్, మే 24: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్న తెలుగు సాహస యువతి నీలిమ రెండోసారి కూడా తృటిలో వైఫల్యాన్ని చవి చూశారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించి తీరాలన్న పట్టుదలతో నీలిమ ముందుకెళ్లినప్పటికీ 8,650 మీటర్లు మాత్రమే ఎక్కగలిగింది.

Pages