S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/28/2016 - 07:25

హైదరాబాద్, మే 27: ఎఐపిఎంటి స్థానే నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు -2 (నీట్-2)లో సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ విద్యార్థులకు మెలిక పెట్టారు. అపెండిక్స్-3లో నీట్ నిర్వహణ కమిటీ సెల్ఫ్ డిక్లరేషన్ నిర్దేశించింది.

05/27/2016 - 06:30

హైదరాబాద్, మే 26: హైదరాబాద్‌లోని ఇంగ్లీషు, ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ) కి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) గుర్తింపు లభించింది. యూనివర్శిటీ ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తోందని పేర్కొంటూ నేక్ ఎ గ్రేడ్‌ను ఇచ్చింది. 2000 సంవత్సరంలో నేక్ తొలిసారి ఇఎఫ్‌ఎల్ యూనివర్శిటీకి ఐదు నక్షత్రాల గ్రేడ్ ను ఇచ్చింది. అప్పట్లో ఇఫ్లూ పేరుతో డీమ్డ్ వర్శిటీగా ఉండేది.

05/27/2016 - 06:25

హైదరాబాద్, మే 26: నగరంలోని ఏటిఎంలకు డబ్బులు సరఫరా చేసే సంస్థలో జరిగిన కుంభకోణంలో సిసిఎస్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. మరో ఎనిమిది కోట్ల మేరకు నిందితులు కొల్లగొట్టారు. నాలుగు రోజుల క్రితం ఏటిఎంలకు డబ్బులు సరఫరా చేసే ఫైనాన్స్ సెక్యూరిటీ సంస్థలో రూ. 9.98 కోట్లు అపహరించబడ్డాయని సంస్థ అధికారి తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

05/27/2016 - 06:18

హైదరాబాద్, మే 26: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సేకరించనున్న భూముల విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారి భూమి నుంచి కదల్చరాదని హైకోర్టు ఏపి రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి జారీ చేశారు.

05/27/2016 - 06:16

హైదరాబాద్, మే 26: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను గురువారం నాడు విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 63.86 శాతం మంది, టెన్త్ పరీక్షల్లో 61.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌కు 56,151 మంది హాజరుకాగా, వారిలో 35,859 మంది ఉతీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షలకు 49,996 మంది హాజరుకాగా, వారిలో 30,713 మంది ఉత్తీర్ణులయ్యారు.

05/27/2016 - 05:35

విజయవాడ, మే 26: ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి పట్ల కృతనిశ్చయంతో ఉందని, దీనిపై విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఎపి పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి సహాయాన్ని అందిస్తూనే వున్నామన్నారు.

05/27/2016 - 05:32

హైదరాబాద్, మే 26: హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న ప్రైవేటు అక్రమ రవాణా అంతరాష్ట్ర సర్వీసులను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ డిమాండ్ చేసింది.

05/27/2016 - 05:32

హైదరాబాద్, మే 26: ఉబ్బసం రోగులకు జూన్ 8న బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపమందు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో చేపమందు కోసం హైదరాబాద్‌కు తరలి వచ్చే ఉబ్బసం రోగులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.

05/27/2016 - 05:31

హైదరాబాద్, మే 26 : జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న దృశ్యాలు సాక్షాత్కరించనున్నాయి. ఆరోజు తెలంగాణలో ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ పేరుతో సంబురాలు నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి హడావుడి లేకుండా ‘నవనిర్మాణ దీక్ష’ పేరుతో ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించారు.

05/27/2016 - 05:30

హైదరాబాద్, మే 26: హైదరాబాద్ నగరంలో టర్కీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని టర్కీ కరెన్సీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే తాజాగా హైదరాబాద్‌లో కూడా టర్కీ నోట్లు మార్పిడికి యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Pages