S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/10/2016 - 05:24

భీమవరం, జనవరి 9: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఒక అజ్ఞాత భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు మంగళసూత్రాలను బహూకరించాడు. కిలో బంగారంతో వీటిని తయారుచేశారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు. ఈ నెల 11వ తేదీన అమ్మవారికి వీటిని అలంకరిస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

01/10/2016 - 05:22

కడప, జనవరి 9: అగ్ర దేశాలకు దీటుగా ఎదిగేందుకు, అభివృద్ధి సాధించేందుకు దేశంలోని విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని, మీరు అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

01/10/2016 - 05:21

హైదరాబాద్, జనవరి 9: ప్రముఖ వస్తవ్య్రాపార సంస్థ కళానికేతన్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ దంపతులను శనివారం సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల నుంచి వారు సుమారు 7.5కోట్లు రుణాలు తీసుకున్నారు.

01/10/2016 - 05:21

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్)కు డిమాండ్ పెరగడంతో డిస్టిలరీస్‌ను విస్తరించాలని, కొత్త డిస్టిలరీస్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు డిస్టిలరీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరో మూడు డిస్టిలరీలను విస్తరించేందుకు అన్ని అనుమతులు ఇచ్చారు.

01/10/2016 - 05:14

హైదరాబాద్, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో చైనా భాగస్వామ్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన చైనా మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా కొత్త ఒప్పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

01/10/2016 - 02:24

హైదరాబాద్, జనవరి 9: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన జరిపిస్తోంది. ఇందుకోసం కడప జిల్లాను పైలట్ జిల్లాగా ఎంపిక చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో చర్చలు జరిపి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఆధారంగా తుది నిర్ణయానికి రానుంది. ఈ క్రమంలోనే కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడను రాష్ట్ర పర్యటనకు పంపించింది.

01/10/2016 - 02:16

విశాఖపట్నం, జనవరి 9: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు- 2016 విశాఖలో జరగబోతోంది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరిగే సదస్సుకు రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆది గోద్రేజ్, జిఎంఆర్ సంస్థల అధినేత జిఎం రావువంటి పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు. సిఐఐ గత 21ఏళ్లలో ఇటువంటి సదస్సులు దేశంలో 22నిర్వహించింది.

01/10/2016 - 02:14

హైదరాబాద్, జనవరి 9: తెలుగుదేశం అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి 24 వరకూ దావోస్‌లో సిఎంతోపాటు పదిమంది బృందం పర్యటించనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సిఎం బృందం పర్యటన చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు.

01/09/2016 - 16:22

హైదరాబాద్ : గ్రేటర్ రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత రమేష్‌రాథోడ్ ఆరోపించారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో టీడీపీ -బీజేపీ నేతలు భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందనేది ప్రధానం కాదు... అంతిమంగా టీడీపీ- బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యమని చింతల రాంచంద్రారెడ్డి అన్నారు.

01/09/2016 - 16:17

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృధా అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ దోచుకున్న డబ్బులతో గ్రేటర్‌లో ఫ్లెక్సీలు పెడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో సెటిలర్స్‌కు సమాన హక్కులుంటాయని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని తెలిపారు.

Pages