S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/09/2016 - 07:25

హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఆయా ఉన్నత విద్యాభ్యాసం మేరకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి సంక్షేమ కమిషనర్ వివి పాండురంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

01/09/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 8: రెండుతెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలపై నెలకొన్న వివాదాలు కొలిక్కి రానున్నాయి. వచ్చే వారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ అథారిటీ నిర్ణయించింది. ఈమేరకు రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులను ఆహ్వానించనుంది. ఒకటి రెండు రోజుల్లో తేదీలు ఖరారుకానున్నాయి.

01/09/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 8: అర్చకుల నియామకం విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు.

01/09/2016 - 07:23

హైదరాబాద్, జనవరి 8: జన్మభూమి కార్యక్రమం నిర్వహించినప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కారమైనట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

01/09/2016 - 07:22

హైదరాబాద్, జనవరి 8: అంగన్‌వాడీల పోరాటాలను దాడులతో అణచివేయలేరని సిఐటియు జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. ఐసిడిఎస్‌ను కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆర్టీసి కళాభవన్‌లో రెండో రోజు జరిగిన అఖిల భారత అంగన్‌వాడీ, సహాయకుల మహాసభలో ఆమె పాల్గొన్నారు.

01/09/2016 - 06:59

కాకినాడ, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహరహం కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో రెండవ పంటకు నీరు ఇచ్చి తీరుతామని, ఇందుకు అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైనంత నీటిని సేకరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని, రైతాంగానికి మేలు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

01/09/2016 - 06:58

దొరవారిసత్రం/తడ, జనవరి 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పక్షుల పండుగను నేలపట్టు,పులికాట్ సరస్సు, నెల్లూరు జిల్లా తడ మండలంలోని భీముల వారిపాలెంలో రెండురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. జెడ్పీ సిఇఓ రామిరెడ్డి ఆధ్వర్యంలో నేలపట్టులో పర్యాటకులకు అనువైన వసతులను ఏర్పాటు చేసే క్రమంలో అధికారులు, సిబ్బంది శుక్రవారం తలమునకలయ్యారు.

01/09/2016 - 06:58

భీమవరం, జనవరి 8: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఒక చర్చి శ్లాబు కూలిన దుర్ఘటనలో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగావుంది. వివరాలిలావున్నాయి... స్థానిక సుంకర పద్దయ్యగారి వీధిలో మన్నా ప్రార్థనాలయం ఆవరణలో కొత్తగా చర్చి నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పనులు మూడు నెలలుగా వేగం పుంజుకున్నాయి.

01/09/2016 - 06:57

ధర్మవరం రూరల్, జనవరి 8: చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చి, మీకు న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతు, చేనేతలకు భరోసానిచ్చారు.

01/09/2016 - 06:56

గుంటూరు, జనవరి 8: దేశంలో పది మంది కార్పొరేట్లు ఏడాదికి లక్ష కోట్లు ఆదాయం గడించే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు నగరంలో సిపిఐ 90వ వార్షికోత్సవ ముగింపు ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భారీ ప్రదర్శన అనంతరం జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించగా సురవరం ప్రసంగించారు.

Pages