S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2018 - 01:01

హైదరాబాద్, ఆగస్టు 20: కేరళలో భారీ వరదల కారణంగా వాటిల్లిన అపార నష్టానికి తోటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అందించిన రూ.25 కోట్ల ఆర్థిక సహాయానికి అదనంగా మరో ఐదు వందల టన్నుల బియ్యాన్ని పంపాలని నిర్ణయించింది. కేరళ రాష్ట్రానికి వెంటనే 500 టన్నుల బియ్యాన్ని పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం అధికారులను ఆదేశించారు.

08/21/2018 - 00:56

హైదరాబాద్, ఆగస్టు 20: ‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబాన్ని తరిమి కొట్టండి..’ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం అన్ని జిల్లాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానలిచ్చారు.

08/21/2018 - 04:57

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికంగా బలంగా మారాలన్న ఉద్దేశంతో ఈ సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి 902 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం

08/21/2018 - 00:51

హైదరాబాద్, ఆగస్టు 20: భారీ వర్షాలు తెలంగాణను మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణను ముంచెత్తుతుండగా, జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా పంట నష్టం జరిగింది. వర్షాల కారణంగా వేర్వేరు జిల్లాల్లో ఐదుగురు మరణించారు. సూర్యాపేట జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు ఇళ్లు కూలి మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలోనే మరొకరు వరదల మూలంగా వైద్యం అందక మృతిచెందారు.

08/21/2018 - 04:57

హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సులను రద్దు చేసి, వాటిని కేవలం పీజీ కోర్సులకు, పరిశోధనలకే పరిమితం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను ఐఐటీలు తిప్పికొట్టాయి. దీనితో జెఈఈల రద్దు యోచనను కేంద్రం విరమించే అవకాశాలున్నాయి. ఒకటిరెండు రోజుల్లో ఈమేరకు ఉత్తర్వులు జారీ కావచ్చని సమాచారం.

08/21/2018 - 04:59

హైదరాబాద్: కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేసిన ఇద్దరు చంద్రులూ వెనుకబడ్డారు. దేశంలో ఎవరు ఉత్తమ ముఖ్యమంత్రి? అని ఇండియా-టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో ఓటర్ల నాడి తెలిసింది. ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.

08/21/2018 - 04:56

అనంతపురం : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోందని, పార్టీని వదిలి వెళ్లిన నేతలు తిరిగి వచ్చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.2014 ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీలోకి వెళ్లిన విధంగా ఇప్పుడు కాంగ్రెస్‌లోకే వలసలు మొదలయ్యాయని చెప్పారు.

08/21/2018 - 00:29

నర్సీపట్నం, ఆగస్టు 20: చంద్రబాబు పరిపాలనకు, బ్రిటిష్ పరిపాలనకు తేడా ఏమీ లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు. విశాఖ జిల్లా కోటవురట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత నాలుగన్నరేళ్ళ నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందన్నారు..ఇసుక, మట్టి, సున్నపురాయి, లేటరైట్ తదితర సహజ వనరులను దోచేస్తున్నారని ధ్వజమెత్తారు.

08/21/2018 - 00:27

అమరావతి, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తేనే నిర్దేశిత గడువు ప్రకారం వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగలదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 57.57 శాతం పూర్తయిందన్నారు. వర్షాల కారణంగా కొంత జాప్యం ఏర్పడిందన్నారు.

08/21/2018 - 04:55

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజన్సీ, మెట్ట ప్రాంతాలు ఆదివారం కురిసిన అధిక వర్షాలకు అతలాకుతలమయ్యాయి. జల్లేరు, ఎర్రకాల్వ, బయనేరు, సంఘం వాగు, ఇతర కొండవాగులు పొంగడంతో రహదార్లకు గండ్లు పడ్డాయి. వంతెనలు కూలిపోయాయి. మున్సిపల్ పట్టణమైన జంగారెడ్డిగూడెంకు, మండల కేంద్రమైన బుట్టాయగూడెంకు ఇతర ప్రాంతాలతో రహదారి సంబంధాలు తెగిపోయాయి.

Pages