S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/22/2018 - 01:16

తిరుపతి, ఆగస్టు 21: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9గంటలకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది.

08/22/2018 - 01:14

హైదరాబాద్, ఆగస్టు 21: హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం హరితహారం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల న్యాయమూర్తి రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు.

08/22/2018 - 02:25

నిజామాబాద్, ఆగస్టు 21: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. స్థానికంగానే కాకుండా ఎగువన మహారాష్టల్రోనూ గడిచిన మూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద జలాలు పెద్దఎత్తున వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి వడివడిగా చేరువవుతోంది.

08/22/2018 - 00:51

హైదరాబాద్, ఆగస్టు 21: పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వచ్చే నెలలో మళ్లీ బస్సు యాత్రను చేపట్టనున్నట్లు టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. బస్సు యాత్ర కోసం మంగళవారం గాంధీ భవన్‌లో ప్రజా చైతన్య బస్సు యాత్ర సమన్వయ కమిటీ కన్వీనర్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్‌తో పాటు సీఎల్‌పి నేత కే.

08/22/2018 - 00:45

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) మంగళవారం కొట్టివేసింది. అన్ని అనుమతులు లభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేదని కూడా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.

08/22/2018 - 00:42

హైదరాబాద్: గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె వ్యవహారం ముదురుతోంది. విధుల్లోకి రావాలని ఓ పక్క ప్రభుత్వం ఆదేశిస్తుండగా, ససేమిరా కుదరదని సిబ్బంది జేఏసీ తేల్చిచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సమ్మె చేస్తున్న సిబ్బంది బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధులకు హాజరు కావాలని మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.

08/22/2018 - 00:35

కోటవురట్ల: విశాఖపట్నం జిల్లా, కోటవురట్ల మండలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమైంది. జగన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు స్వాగతం పలికారు. కైలాసపట్నంకు చెందిన ఏటికొప్పాక లక్కబొమ్మల తయారు చేసే కార్మికులు అంకుడు కర్ర, లక్కతో చేసిన ఫ్యాన్ బొమ్మను జగన్‌కు బహూకరించారు.

08/22/2018 - 00:29

అమరావతి, ఆగస్టు 21: ఒకవైపు అతివృష్టి..మరోవైపు అనావృష్టి.. కోస్తా జిల్లాల్లో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండు దశకు చేరుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా

08/22/2018 - 00:27

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉద్ధృతి మూడో ప్రమాద హెచ్చరిక దిశగా అడుగులేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ అన్ని గేట్లను పూర్తిస్థాయిలో తెరిచి వరద నీటిని వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రభావంతో దిగువనున్న కోనసీమ లంక గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి 48.10 అడుగులకు పెరిగింది.

08/21/2018 - 17:37

విశాఖపట్నం: ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారయత్నానికి పాల్పడటాన్ని నిరసిస్తూ విశాఖలోని ఓ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. డాబా గార్డెన్స్‌లోని ఒకేషనల్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కళాశాల అద్దాలను పగులగొట్టారు. ఫ్లెక్సీలను చింపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రిన్సిపాల్‌ను తమ అదుపలోనికి తీసుకున్నారు. విద్యార్థులు పోలీసు స్టేషన్ ఎదుట కూడా ధర్నా చేశారు.

Pages