S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/22/2018 - 13:42

నిజామాబాద్: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని బుధవారం ఉదయం విడుదల చేశారు. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డి గోదావరి నీటికి పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1084.50 అడుగులకు చేరుకున్నట్లు తెలిపారు.

08/22/2018 - 13:38

కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన బుధవారం ఉదయం వాకింగ్‌కి వచ్చారు. కొత్తపల్లి మండలం రేకుర్తి వద్ద నడకకు వెళ్లివస్తుండగా గుండెపోటు రావటంతో కుప్పకూలారు. ఆసుప త్రికి తరలిస్తుండగా చనిపోయారు.

08/22/2018 - 12:50

తాడేపల్లి: తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిని చూసేందుకు వచ్చిన నలుగురు విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. కృష్ణాబ్యారేజీ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన విద్యార్థులు తాడేకోరు శివ (14), నీలం క్రాంతికుమార్ (10), నీలం శశి (8), దినేష్ (7)గా నీటిలో కొట్టుకుపోయారు. వీరంతా చిర్రావూరు వాసులుగా గుర్తించారు.

08/22/2018 - 12:49

హైదరాబాద్: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపింది. ఇప్పటికే రూ.25కోట్లు నగదు, పాలపొడి, నీటిని శుద్ధిచేసే యంత్రాలు, బాలామృతం ఆహారాన్ని అందజేసిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బియ్యాన్ని 18 లారీల్లో పంపింది. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఊపారు.

08/22/2018 - 12:46

నాగర్‌కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నీటిమట్టం 883.20 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.

08/22/2018 - 12:44

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి. ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఈద్‌ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బక్రీద్‌ను పవిత్ర దినంగా భావిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ మేకల వ్యాపారం జోరుగా సాగుతుంది.

08/22/2018 - 02:48

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ నెల 23 నుండి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం చెప్పారు.

08/22/2018 - 02:43

కర్నూలు, ఆగస్టు 21: శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మంగళవారం అధికారులు మూసివేశారు. ఎగువన కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద పూర్తిగా తగ్గిపోవడంతో గేట్లన్నింటినీ మూసివేశారు. అయితే ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు సుమారు 76,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి మంగళవారం ఉదయం సమయానికి వరద తగ్గింది.

08/22/2018 - 02:42

హైదరాబాద్, ఆగస్టు 21: వర్షాకాలంలో ఎలాంటి ప్రమాధాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఓం వినోద్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రైల్ నిలయంలో జోన్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, సమయపాలన, సరుకు రావాణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

08/22/2018 - 02:03

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: జానపద మూలాలను అనే్వషించి, వాటిని వెలికి తీసి భావితరాలకు అందించాలని అపుడే జానపద సంస్కృతిలోని ఔన్నత్యం వారికి అందుతుందని ప్రముఖ రచయిత, ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ జానపద విజాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Pages