S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/08/2018 - 21:48

హైదరాబాద్, ఆగస్టు 8: కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మహిళా ఫ్రంట్ రాబోతున్నది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ‘కారా’ సభ్యురాలు, మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సారథ్యంలో ‘ఫ్రంట్’కు రూపకల్పన జరుగుతున్నది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఇటీవల పుష్పలీలను ‘కారా’ (చైల్డ్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ) సభ్యురాలిగా నియమించారు.

08/08/2018 - 21:46

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణలోప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతల్లో రైతులు 24 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తున్నందున విద్యుత్ అమాంతంగా పైపైకి ఎగబాకిందని ట్రాన్సకో అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రుతుపవణాల గమనంలో పురోగతి లేనందున వర్షాలు తక్కువ శాతం నమోదు అయ్యింది. వాతావరణం చల్లబడడంతో పట్టణాల్లో విద్యుత్ వినియోగం తగ్గింది.

08/08/2018 - 22:21

హైదరాబాద్: వేదాధ్యయనం సమాజ సంక్షేమం కోసం, వేదాల పరిరక్షణకోసం జరగాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేర్వేరు వేద విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ సమీపంలోని ‘జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ’ (జీవా) లో నిర్వహిస్తున్న మూడురోజుల వేద పరీక్షలను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

08/09/2018 - 05:25

హైదరాబాద్: మొబైల్ కనక్షన్, జీపీఎస్ సిగ్నల్, ఆధార్ అనుసంధానం వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వారికి ఏ మాత్రం అవగహన లేదు... సమస్య ఏదైనా వీరికి తెలిసిందల్లా ఒక్కటే... అదే నెలనెలా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే రేషన్ బియ్యం. సకాలంలో రేషన్ బియ్యం అందకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా కొంతమంది నిరుపేదలకు లేకపోలేదు.

08/08/2018 - 21:29

హైదరాబాద్, ఆగస్టు 8: బ్లాక్ చెయిన్ టెక్నాలజీస్-సొల్యూషన్స్‌లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ట్యాలెంట్ స్ప్రింట్ సహకారంతో అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికేట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్- మెషిన్ లెర్నింగ్‌పై ఇంతకు ముందు ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా దీనిని ప్రారంభించినట్టు ట్రిపుల్‌ఐటీ హెచ్ డైరెక్టర్ డాక్టర్ పీజే నారాయణ్ తెలిపారు.

08/08/2018 - 22:23

హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చి ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) తొలి దశ పరీక్షను నవంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు ఆగస్టు 29వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయం వెబ్‌సైట్ ద్వారా ఆహ్వానిస్తున్నట్టు పరీక్షల

08/08/2018 - 21:27

*బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి * పల్లెపల్లెకూ మోదీ పథకాలు: డాక్టర్ లక్ష్మణ్

08/08/2018 - 14:03

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరుణానిధి సేవలను కీర్తించారు. సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

08/08/2018 - 04:30

నల్లగొండ: పధ్నాలుగేళ్ల పాటు మావోయిస్టు పార్టీ అజ్ఞాత సాయుధ గెరిల్లా దళాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామవాసి షేక్ జానిబీ అలియాస్ కక్కబుజ్జి ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. మూడు రోజుల క్రితమే ఆమె జిల్లా పోలీసులకు లొంగిపోయినప్పటికీ మంగళవారం ఎస్పీ రంగనాథ్ అధికారికంగా ఆమె లొంగుబాటును ప్రకటించారు.

08/08/2018 - 02:50

ఖమ్మం, ఆగస్టు 7: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటవిక పాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం నగరంలోని సుందరయ్యభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు.

Pages