S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/27/2018 - 04:38

అమరావతి: అవిశ్వాస తీర్మానం చర్చకు అవకాశం ఉండటంతో ఎంపీలు సభలో కదం తొక్కాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిన మనం, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి సంబంధించిన వివరాలను అన్ని పార్టీలకూ అందించాలని సూచించారు. మంగళవారం అవిశ్వాసం చర్చ జరగవచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు.

03/27/2018 - 03:25

శ్రీశైలం టౌన్, మార్చి 26: శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారు, శ్రీ మల్లికార్జునస్వామి వార్ల కు విజయవాడకు చెందిన గోగులునాయుడు, విజయలక్ష్మి దంపతులు బంగారు హారాలు, వెండి కిరీటాలు విరాళం అందించారు. అమ్మవారికి 110 గ్రా ముల బంగారుతో మామిడి పిందెల హారం, స్వామి వారికి 122 గ్రాములతో బంగారు గుండ్లహారం, కల్యాణ ఉత్సవమూర్తులకు కిలో 279 గ్రాములతో వెండి కిరీటాలు సమర్పించారు.

03/27/2018 - 02:37

ఒంటిమిట్ట, మార్చి 26: కడప జిల్లా ఒంటిమిట్ట లో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించారు. స్వామివారు వేణుగాన అలంకారం లో భక్తులకు దర్శమనిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి వేణుగాన అలంకారం చేశారు. పిల్లనగ్రోవి చేత ప ట్టుకుని స్వామిని భక్తులకు దర్శనమిచ్చారు.

03/27/2018 - 03:22

మహబూబ్‌నగర్, మార్చి 26: నాగర్ కర్నూల్ జిల్లా సిరసనగండ్లలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. నాల్గవ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తులు వేలాది తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తన్మయం చెందారు. సీతారాముచంద్రుల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా హోం శాఖమంత్రి నాయిని న ర్సింహారెడ్డి హాజరయ్యారు.

03/27/2018 - 02:25

మదనపల్లె, మార్చి 26: గుడ్లగూబ జాతిలో అరుదైన ఇంగ్లండ్ దేశానికి బర్న్‌ఓల్ పక్షి సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ముస్లింల శ్మశానవాటిక వద్ద ప్రత్యక్షమైంది. ఈ పక్షిని కాకులు తరుముకుంటూ గాయపరుస్తుంటే.. అక్కడే ఉన్న ముస్లిం యువకులు ఆ పక్షిని కాపాడారు. ఎఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ సహకారంతో యువకులు మదనపల్లె అటవీశాఖ అధికారి ఈశ్వరయ్యకు అప్పగించారు.

03/27/2018 - 02:28

విజయనగరం/నెల్లిమర్ల, మార్చి 26: ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వై భవంగా జరిగింది. సోమవారం నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సరం శ్రీ రాముని జన్మ సంవత్సరం కావడంతో ఈ దఫా క ల్యాణ ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నా యి.

03/27/2018 - 01:38

అమరావతి, మార్చి 26: వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు పట్ల ప్రజల్లో 75 శాతం సంతృప్తి వ్యక్తమైంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ 1100 పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వైద్య, ఆరోగ్య శాఖపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 75 శాతం ఆ శాఖ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు.

03/27/2018 - 01:36

భీమవరం, మార్చి 26: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో మంగళవారం నుంచి ‘ఎలక్ట్రికల్ సోలార్ వెహికల్ చాంపియన్ షిప్-2018’ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో దేశంలోని 16 రాష్ట్రాల నుండి 64 జట్లు పాల్గొంటున్నాయి.

03/26/2018 - 16:35

నిర్మల్: శ్రీరామ నవమి వేడుకలు సందర్భంగా నిర్మల్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామనవమి సందర్భంగా నిర్మల్‌లో హిందూ వాహిణీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అదే సమయంలో ఘర్షణ తలెత్తి రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో యాత్రకు అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

03/26/2018 - 16:23

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై తాను స్పందించాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులతో సుదీర్ఘ సమావేశం తరువాత విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమకు బీజేపీ, టీడీపీలపై విశ్వాసం పోయిందని అన్నారు. ఏపీ ప్రజలకు వౌలిక వసతులు కల్పించటంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.

Pages