S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2018 - 04:42

హైదరాబాద్, మార్చి 5: వచ్చే ఎన్నికల్లో మోడికి లబ్దిచేకూర్చేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

03/06/2018 - 04:37

హైదరాబాద్, మార్చి 5: ఇంత కాలం ప్రవేశపరీక్షలకే పరిమితమైన ‘ఒక్క నిమిషం’ నిబంధనను ఇక మీదట పదో తరగతి పరీక్షలకు సైతం అమలు చేయాలని ప్రభుత్వం యోచించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

03/06/2018 - 04:30

హైదరాబాద్, మార్చి 5: ధర్డ్ ఫ్రంట్ వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు కాంగ్రెస్‌కు చేరువ అవుతున్నారని, దీంతో బీజేపీనే కేసీఆర్‌ను రంగంలోకి దింపిందన్నారు. తెరవెనుక జరుగుతున్న పరిణామాలను ప్రజలు గ్రహించాలని సూచించారు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని ఆరోపించారు.

03/06/2018 - 04:27

హైదరాబాద్, మార్చి 5: గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ఆ పార్టీ నేత పీఎల్ శ్రీనివాస్ రచించిన ‘కరదీపిక’ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆర్థిక, సాగునీటి, వ్యవసాయ రంగంల్లో రాష్ట్రం సాధించిన అభివృద్థి ఇందులో అద్బుతంగా పొందుపరిచారని అన్నారు.

03/06/2018 - 04:23

హైదరాబాద్, మార్చి 5: ప్రధాని నరేంద్రమోదీ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యయుత పద్ధతిలో చలో ప్రగతి భవన్‌కు పిలుపునిస్తే, సిఎం కేసీఆర్ ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నియంతృత్వ ప్రభుత్వం రాజ్యమేలుతోందని అన్నారు.

03/06/2018 - 04:23

హైదరాబాద్, మార్చి 5: శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు వెంటనే సరైన జవాబులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు.

03/06/2018 - 04:20

హైదరాబాద్, జనవరి 5: రవాణా శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శాఖలో దళారీ వ్యవస్థ పూర్తిగా రద్దవ్వాలని అన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి రవాణా శాఖ ఆధునీకరణ, అవినీతి నివారణ, ఎన్‌ఐసీ ఆధారిత కార్యకలాపాలపై శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జెటిసి రమేష్ తదితరులతో సమీక్షించారు.

03/06/2018 - 04:19

హైదరాబాద్, మార్చి 5: బీసీ రిజర్వేషన్ల పెంపుప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ కమిషన్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చిన కమిషన్ చైర్మన్ రాములుకు వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

03/06/2018 - 04:18

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలోని ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 జిల్లాల్లో కనీసం వంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుముఖంగా ఉన్నారు. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు వీలుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని సిఎం ఏర్పాటు చేశారు.

03/06/2018 - 04:17

హైదరాబాద్, మార్చి 5: ఉద్యోగ నియామకాల్లో అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయమని , చట్టం అందుకు అంగీకరించదని నిరుద్యోగులు దాఖలు చేసిన పిటీషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ ప్రారంభించింది. అభ్యర్ధుల తరఫున ఎస్ సత్యం రెడ్డి, కపూర్‌లు వాదనలు వినిపించారు.

Pages