S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/08/2017 - 03:06

హైదరాబాద్/ గచ్చిబౌలి, నవంబర్ 7: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో మంగళవారం మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆయన పరిస్థితి కుదుటపడిందని ఆస్పత్రి నుంచి త్వరలోనే డిస్చార్చి చేయనున్నట్టు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో మంగళవారం సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.

11/08/2017 - 03:05

అమరావతి, నవంబర్ 7: ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా శాసనసభ సమావేశాలు అర్ధవంతం, విజయవంతంగా జరిగాయన్న సంకేతాలిచ్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా ముగియడం ద్వారా, ప్రతిపక్షమైన వైసీపీ ఉన్నప్పటి పరిస్థితిని, బహిష్కరించిన తర్వాత పరిస్థితిని ప్రజలే బేరీజు వేసుకునేలా సభ జరగాలని టీడీపీ నిర్ణయించింది.

11/08/2017 - 03:02

అమరావతి, నవంబర్ 7: ఎన్నికల ముందే కూస్తున్న రాజకీయ కోయిలలకు కేంద్రప్రభుత్వ నిర్లిప్త వైఖరి బ్రహ్మాస్త్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతోపాటు, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలు ఇప్పటివరకూ అమలుచేయని వైనానికి తోడు ఏడాదిక్రితం నాటి పెద్దనోట్ల రద్దు, తాజా జీఎస్టీ నిర్ణయాలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

11/08/2017 - 03:59

హైదరాబాద్, నవంబర్ 7: భద్రాచల సీతారామస్వామి గురించి సిపిఎం మాట్లాడటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సరదాగా పేర్కొన్నారు. భద్రాచలం రాముడి భూములను కాపాడాలంటూ సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో కోరారు.

11/07/2017 - 03:10

హైదరాబాద్, నవంబర్ 6: సికింద్రాబాద్ డివిజన్‌లోని ఎర్రుపాలెం-తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల మరమ్మతులు కారణంగా ఆ రూట్లో నడిచే రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.77292 విజయవాడ- భద్రాచలం రోడ్ పాసింజర్ రైలు ఈ నెల 6 నుంచి 12 వరకు ఉదయం 8 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలు దేరుతుందని తెలిపింది.

11/07/2017 - 02:31

హైదరాబాద్, నవంబర్ 6: జాతీయ జాతరగా మేడారాన్ని గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మరోమారు కేంద్రానికి పంపుతామని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో మాట్లాడుతూ మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో జరగనుందని, జాతరకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సుమారు కోటిమంది వస్తారని అంచనా వేశామన్నారు.

11/07/2017 - 02:30

హైదరాబాద్, నవంబర్ 6: భూముల రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ అంశంపై సోమవారం అసెంబ్లీలో హోరా హోరీగా చర్చ జరిగింది. ప్రభుత్వం వద్ద ఉన్న భూములు ఎన్ని? హరిత హారానికి కేటాయించిన భూములు ఎన్ని? వక్ఫ్, భూదాన్, దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న భూములు, ఆక్రమణకు గురైన భూములు ఎన్ని? అనే అంశంపై సిట్టింగ్ జడ్జితో లేదా అసెంబ్లీ సభా సంఘాన్ని నియమించి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.

11/07/2017 - 02:27

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం ఈనెల 12తో ముగియనున్నందున కొత్త డీజీపీ పోస్టుకు పోటీ పెరిగింది. ఇప్పటి వరకు నగర పోలీస్ కమిషనర్, అదనపు డీజీపీ మహేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా వార్తలొచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీనే నియమించే యోచనలో ఉంది. దీంతో డీజీపీ రేసులో మహిళా ఐపీఎస్ సీనియర్ అధికారి తేజ్‌దీప్ కౌర్ కూడా బరిలోకి దిగారు.

11/07/2017 - 02:25

హైదరాబాద్, నవంబర్ 6: ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ఆందోళనలో మృతి చెందిన భారతి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు అసెంబ్లీలో సిఎం కేసీఆర్ ప్రకటించారు. కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే ఉద్యోగం కల్పిస్తామని, ఆమె పిల్లలు చిన్నవాళ్లయితే పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించారు.

11/07/2017 - 02:12

విజయవాడ, నవంబర్ 6: రాష్ట్రంలో జరుగుతున్న ‘నీరు-ప్రగతి’ పనుల పురోగతిని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. సిఎం చంద్రబాబు ‘నీరు- ప్రగతి’పై వారం వారం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లో సోమవారం గవర్నర్ కూడా పాల్గొని అధికారుల్లో స్ఫూర్తి నింపారు. ఊహించని విధంగా టెలీకాన్ఫరెన్స్ లైన్‌లోకి గవర్నర్ రావడం అధికారులు, ఇతర ఉద్యోగులను ఆశ్చర్యపర్చింది.

Pages